ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందేశం

 

 

ప్రపంచం ఎలా నడుస్తుందో తెలుసుకోవటానికి ధ్యానం చేయాలని గౌతమ బుద్ధుడు బోధించారు. ధ్యానం జ్ఞానానికి మార్గం. పరిపరివిధాల పరిభ్రమించే మనస్సును ఒక్కచోట నిలిపే ప్రక్రియ ధ్యానం. "శ్వాస మీద ధ్యాస" నిలిపితే శరీరానికీ, మనస్సుకూ అనుసంధానం కుదిరి అద్భుతాలు సాధించవచ్చు. ఏకాగ్రత, సృజనాత్మకతలు ధ్యానంతో మెరుగవుతాయి.

 

ధ్యానంతో మనం రోజూ చేసే పనులను మరింత పరిపక్వతతో, సామర్థ్యంతో పూర్తిచేయవచ్చు. అందుకే ధ్యానాన్ని ఆచరించాలి. రాగ, ద్వేష రహిత స్థితికి ధ్యానం ఒక మార్గం, అది ఒక జ్ఞాన మార్గం. మనిషిలో దైవత్వం వెల్లడి కావటానికి అది తోడ్పడుతుంది.

 

మరింత ఏకాగ్రతతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించటానికి సచివాలయ ఉద్యోగులు ధ్యాన మార్గం ఎంచుకోవటం ప్రశంసనీయం. పిరమిడ్ ధ్యానం ద్వారా తాము పొందిన అనుభవాలనూ, ఆత్మజ్ఞానాన్నీ పుస్తకరూపంలో వెలువరించటం ముదావహం. పిరమిడ్ ధ్యానంతో మరో ప్రపంచం సృష్టించటానికి కృషిచేస్తున్న శ్రీ పత్రీజీకి, సచివాలయ పిరమిడ్ మాస్టర్లకూ అభినందనలు.

 

 


Chief Minister
చంద్రబాబునాయుడు

Go to top