దేవినేని ఉమా మహేశ్వరరావు సందేశం

 

ప్రపంచానికి యోగ విజ్ఞానాన్ని అందించిన యోగ భూమి మన భరతభూమి. రామకృష్ణ పరమహంస, వివేకానంద, పరమహంస యోగానంద, మౌనముని రమణమహర్షి వంటి ఎందరో మహానుభావులు యోగ మార్గంలో పయనించి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించటం మనందరికీ తెలిసిన విషయమే.

 

యోగ విద్యకు మూలం ధ్యానం, ధ్యాన సాధన ద్వారా ఏకాగ్రత సిద్ధించి మనిషిలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. దాని వలన నిత్య జీవితంలో మనం నిర్వహించే పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం.

 

అటువంటి ధ్యాన మార్గాన్ని అవలంబించాలని మన సచివాలయ ఉద్యోగులు తలపోయడం ఎంతో ఆనందదాయకం. అందులో భాగంగా ధ్యాన విజ్ఞానాన్ని, ధ్యానం ద్వారా తాము పొందిన అనుభవాలను, "ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయం" అనే పుస్తక రూపంలో వెలువరించటం అభినందనీయం.

 

ధ్యాన గురువులకూ మరి ధ్యాన సాధకులకూ శుభాభివందనాలు.

 

 

దేవినేని ఉమా మహేశ్వరరావు
Minister for Resources

 

Go to top