పైడికొండల మాణిక్యాల రావు సందేశం

 

 

ధ్యానం ఆత్మ సాక్షాత్కారానికీ, ముక్తికీ సోపానం. అధికంగా విశ్వశక్తిని పొందగలిగే మార్గం ధ్యానం. ధ్యానం ద్వారా పొందే శక్తి వలన మనలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది. ఇది మన అతీంద్రియ శక్తులను కూడా ప్రాభావితం చేస్తుంది. ధ్యానం ద్వారా మనం పొందే శక్తి వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణా జ్ఞానం పొందుతాం. ఈ మహాద్భుత జ్ఞానాన్ని పొందటానికి ఏకైక మార్గం ధ్యానం. దైనందిన జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పొందటానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది.

 

మన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు కేంద్ర బిందువు అయిన సచివాలయంలో ఉద్యోగులు నిరంతరం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. సచివాలయ ఉద్యోగులందరూ ధ్యాన సాధన ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి నిర్దేశించిన పుస్తకమే "ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయం".

 

ఇంతటి గొప్ప ధ్యానాన్ని తెలియజేసిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీ గారికి ఆత్మాభివందనాలు తెలియజేస్తూ ....

 

పైడికొండల మాణిక్యాల రావు
Minister for Endowments

Go to top