సిద్దా రాఘవరావు సందేశం

 

 

ధ్యానం మనిషిలోని దైవత్వాన్ని తట్టిలేపుతుంది. ప్రతిరోజూ ధ్యానసాధన చేయటం ద్వారా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండగలరు. చక్కగా తమ విధలను నిర్వహించగలరు.

 

ఇప్పుడున్న పరిస్థితులలో ధ్యానం అన్నది ప్రతి మనిషికీ అత్యావశ్యకం. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులందరూ కలిసి ధ్యానం చేస్తూ .. అన్ని రకాలుగా ధ్యానం యొక్క ఫలితాలను పొందుతూ, ఆనందంగా, పరిపూర్ణ ఆరోగ్యంగా, జ్ఞానవంతంగా జీవిస్తున్నారు. వీరందరి ధ్యానానుభవాలతో కూడిన ఈ పుస్తకమే అందుకు నిదర్శనం. సచివాలయ ఉద్యోగుల ధ్యానానుభవాలతో కూడిన ఈ పుస్తకం మిగతా ఉద్యోగులందరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.

 

ఇంతటి గొప్ప ధ్యానాన్ని రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా తెలియజేసి .. వారిచేత ఆచరింపచేస్తూ .. సచివాలయ ఉద్యోగుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ .. అంతేకాకుండా ఊరూరా, గ్రామ గ్రామాన, వాడవాడలా .. ప్రపంచవ్యాప్తంగా ధ్యాన విశిష్ఠతను తెలియజేస్తూ .. "ధ్యాన జగత్" .. "పిరమిడ్ జగత్" .. "శాకాహార జగత్"లకై .. విశేషంగా అహర్నిశలు కృషి చేస్తున్న మహానీయులు బ్రహ్మర్షి పత్రీజీకీ .. పిరమిడ్ మాస్టర్స్‌కూ .. మరి సచివాలయ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ ...

 

సిద్దా రాఘవరావు
Minister for Transport & Building

Go to top