పరిటాల సునీత సందేశం

 

 

ప్రపంచ దేశాలన్నీ యోగా, ధ్యానాల వైపు మక్కువ చూపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ధ్యానం మనకు చక్కని ఆరోగ్యాన్నీ, ప్రశాంతతనూ మరి పరిపక్వతనూ ఇస్తుంది. అందుకే ధ్యానాన్ని ఆచరించాలి. మన రాష్ట్రంలోని శాసన నియమాలను అమలుపరిచే సచివాలయ ఉద్యోగులు ధ్యానం చేయటం అభినందనీయం. ఆ విధంగా ఆలోచించడం గొప్ప విషయం.

 

ధ్యానం చేయడంవలన కలిగే లాభాలను పుస్తక రూపంలో తీసుకురావటం వల్ల ఎంతో మందికి ధ్యానం యొక్క ప్రాముఖ్యత తెలియజేయబడుతుంది. అందుకు సచివాలయ ధ్యానులందరినీ అభినందిస్తున్నాను.

 

ధ్యానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీకి ఆత్మాభినందనలు తెలియజేసుకుంటూ ...

 

 

పరిటాల సునీత
ధరల పర్యవేక్షణ వినియోగదారుల వ్య్వహారాలు
ఆహారం మరియు పౌరసరఫరాల శాఖామాత్యులు

Go to top