" శ్వాసను పట్టుకుంటే ఒడ్డుకు చేరుతాం "

 

పేరు: A.పద్మావతీ దేవి
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : ఇరిగేషన్

 

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నన్ను ధ్యానానుభవాలు రాయమని లీల గారు అడిగినప్పుడు, ఏం వ్రాయాలో నాకు అర్థం కాలేదు. ధ్యాన అనుభవంలో .. అనుభూతి మాత్రమే ఉంటుంది. అనుభూతికి అక్షర రూపం రావాలంటే ఎలా? అది అనుభవిస్తేనే అనుభూతి లభిస్తుంది. ధ్యానం చేస్తేనే, ఆ ధ్యాన అనుభూతి లభిస్తుంది. అది నిశ్చలంగా, నిర్మలంగా మరి ప్రశాంతంగా ఉండే స్థితి.

 

అన్ని రకాల ఒత్తిడులనూ దూరం చేసి, జీవనశైలిని ప్రశాంత స్థితిలో నడిపే నావ ధ్యానం. నదిలో కొట్టుకొనిపోయేవానికి, ఒక తెడ్డు దొరికితే దాని సాయంతో ఒడ్డుకు చేరుకుంటారు. ఈ "సచివాలయం" అనే మహా సముద్రంలో, మధ్యాహ్న భోజన సమయంలో ధ్యానం అనే తెడ్డు సహాయంతో ఎటువంటి పనినైనా సక్రమంగా చేయగలుగుతున్నాం.

 

ధ్యానం అనే తెడ్డు పట్టుకోకపోతే, సముద్రంలో కొట్టుకొని పోయేవాళ్ళం .. శ్వాసను పట్టుకుంటే-ఒడ్డుకు చేరుతాం .. వదిలితే - మహాసముద్రంలో కొట్టుకొని పోతాం. ఇంట్లో పనిచేస్తూ ఆఫీసుకి బస్సులో వస్తూ, నడుస్తూ, భోజన సమయంలో, ఇంటికి వెళ్తూ ఇలా ఏ పని చేస్తున్నా ‘శ్వాస మీద ధ్యాస’ను నిలుపుతుంటాను.

 

ధ్యానమే జీవితాన్ని సక్రమంగా నడిపిస్తూ, గమ్యానికి చేరుస్తుంది. సచివాలయ మహాసముద్రంలో మేము ధ్యానమనే నావ ఎక్కాము. అదే మమ్మల్ని సరియైన దారిలో నడిపిస్తూ, గమ్యానికి చేరుస్తుందని తెలుసుకుని ధ్యాన ప్రయాణం చేస్తున్నాము.

 

సందేశం : అందరూ ధ్యానం చేసి శ్వాసను పట్టుకుంటే ఒడ్డుకు చేరుతాం, వదిలితే మహాసముద్రంలో కొట్టుకొనిపోతాం. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

Go to top