" శాకాహారం అమృతాహారం "

 

 

పేరు : M.సంధ్యారాణి
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : జనరల్ అడ్మినిస్ట్రేషన్

 

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను ధ్యానంలోకి 2002 లో వచ్చాను. సూర్యప్రభ మేడమ్ క్లాస్‌కి రెండు రోజులు వెళ్ళాను. " ఆరోగ్యం కోసమే ధ్యానం " అని భావించి, "ఆరోగ్యంగానే ఉన్నానుగా " అని ధ్యానం క్రమం తప్పకుండా చేసేదానిని కాదు.

 

1997 లో పూర్తిగా శాకాహారం తీసుకోవటం మొదలుపెట్టాను. అంతకు ముందు కూడా నెలకి ఒక్కసారి ఎవరికన్నా వండిపెట్టడం చేసేదానిని. తరువాత పూర్తిగా వదిలేసాను. మా కుటుంబంలో అందరూ శాకాహారం తీసుకుంటున్నారు.

 

2008 నుండి పూర్తిగా ధ్యానం అంటే ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, "మన అంతరంగంలోని దైవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం, భూమి మీదకు వచ్చిన పని ఏమిటో తెలుసుకోవడం కోసం" అని తెలిసి .. మళ్ళీ ధ్యానం చెయ్యటం మొదలుపెట్టాను. అందరికీ ఆఫీసు పని వేళలలో కుదరకపోవచ్చు. నాకూ కుదరటం లేదు. కనుక రాత్రి నిద్రకు ముందు, ఉదయం దైనందిన కార్యక్రమాలకు ముందు ధ్యానం చేస్తున్నాను.

 

ధ్యానశక్తితో రోజంతా ఇంటి పనులు, ఆఫీసు పనులు ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మరింత నేర్పుగా చేయగల్గుతున్నాను. క్లిష్టమైన విషయాలలో అంతరంగం నుండి వచ్చే సూచన నాకు చాలా ఉపయోగకరంగా ఉంది.

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ద్వారా ప్రచురించబడిన ఆధ్యాత్మిక పుస్తకాలన్నింటినీ దాదాపుగా చదివాను. ప్రతిరోజూ చక్కగా ధ్యానం చేస్తూ అనేక ధ్యానానుభవాలు పొందుతూ ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాను మరి కౌన్సిలింగ్ చేస్తున్నాను.

 

పత్రీజీ రచించిన పుస్తకాలను అంతేకాకుండా లోబ్‌సాంగ్ రాంపా, సేత్, భగవాన్ రజనీష్ ఇలా అనేక మంది మాస్టర్స్ యొక్క పుస్తకాలను నేను చదివి వారి యొక్క జ్ఞానాన్ని నా జీవితంలో ఆచరిస్తున్నాను. ఎంతో అద్భుతమైన జ్ఞానం సేత్ విజ్ఞానం. నేను సేత్ వర్క్‌షాప్‌కి వెళ్ళినప్పుడు ఎన్నో దివ్యానుభావలను పొందాను. నా జీవితంలో అనేక ధ్యానానుభవాలు ఉన్నాయి.

 

మా నాన్న గారు ధ్యానం చేయటం వలన ఆయన ఆరోగ్యం అంతా బాగైంది. మా నాన్నగారికి మాస్టర్స్ ఆస్ట్రల్‌గా హీల్ చేశారు. మా అబ్బాయి బైక్ మీద నుంచి పడిపోయి చాలా సమస్య ఏర్పడింది. కానీ ఎటువంటి ఆపరేషన్ లేకుండా ధ్యానం ద్వారా తన సమస్యను తగ్గించుకున్నాడు. ధ్యానం చేస్తే ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది అందుకు మా కుటుంబమే గొప్ప ఉదాహరణ.

 

నేను అన్ని ధ్యానమహాచక్రాలకు అటెండ్ అయ్యాను. ధ్యానమహాచక్రాల ద్వారా పొందే జ్ఞానం అనంతం. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 18 నుంచి 31 వరకు జరిగే ధ్యాన మహాచక్రానికి విచ్చేసి గొప్ప యోగులు కాగలరని ఆశిస్తున్నాను. ధ్యానమహాచక్రం అంటే మనల్ని మనం తెలుసుకోవటానికి పత్రీజీ సంకల్పించిన ఒక గొప్ప యజ్ఞం.

 

నా సహచరులు అంతా కూడా ధ్యానామృతాన్ని ఆస్వాదించి అనుభవంలోకి తెచ్చుకోవాలని అభిలషిస్తున్నాను.

 

సందేశం : జీవితంలో వచ్చే ఒడిదుడుకులను నిశ్చల మనస్సుతో గమనించే అవగాహన ధ్యానం ద్వారా లభిస్తుంది. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

Go to top