" భవిష్యత్తు తెలిసింది "

 

 

పేరు : D.సుమలత
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : విజిలెన్స్ కమీషన్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

మన ఆలోచనా రహిత స్థితియే ధ్యానం. ఆ స్థితిలో మనకు ఎన్నో అనుభవాలు సొంతమవుతాయి, "ముందుగా భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా ధ్యానంలో తారసపడతాయి" అనేదానికి ఉదాహరణగా నాకు ఒక అనుభవం .. ఒకసారి అందరూ కలిసి ధ్యానం చేస్తూండగా నాకు ఎన్నడూ పరిచయం లేని ఒక వ్యక్తి మాట్లాడుతూ కనిపించారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తిని నేను సికింద్రాబాద్‌లో ఒక ధ్యాన సదస్సులో చూడటం, ఆయన సందేశాన్ని వినడం జరిగింది. ఇంకోసారి పిరమిడ్ క్రింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు నా శరీరంలోకి విశ్వశక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందాను.

 

సందేశం : ప్రతిరోజూ విధిగా ధ్యానం చేద్దాం. పిరమిడ్ శక్తిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుందాం.

Go to top