" ఆందోళన పోయింది .. ఆనందంగా జీవిస్తున్నాను "

 

పేరు: M.S.S శైలజ
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : పంచాయితీరాజ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.


ఒక సంవత్సరం నుండి నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయడం వల్ల నాకు జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడింది. ఏదైనా సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దాని గురించి ఆందోళన పడకుండా .. పాజిటివ్‌గా ఆలోచించి సమస్యను ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను.

 

నాకు మెడనొప్పి ఉండేది. రోజూ ధ్యానం చేయటం వలన అది తగ్గిపోయింది. ధ్యానం చేయటం వల్ల మనకున్న శారీరక రుగ్మతులను తగ్గించుకోవచ్చు .. మన ఆధ్యాత్మిక పురోగతికి కూడా ధ్యానం ఎంతగానో సహాయపడుతుంది.

 

సందేశం : ధ్యానం ద్వారానే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరి ఆధ్యాత్మిక పురోగతి. కనుక మనమందరం తప్పక ధ్యానం చేద్దాం.

Go to top