" తలనొప్పి పోయింది .. ఏకాగ్రత పెరిగింది "

 

పేరు: B.శారద
హోదా: కంప్యూటర్ ఆపరేటర్
విభాగం : కో - ఆపరేటివ్ సొసైటీ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ఆగస్ట్ 2010లో వారం రోజుల పాటు శ్రీమతి సూర్యప్రభ మేడమ్, లీలా మేడమ్ గార్లు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అర్ధ గంట సేపు ధ్యానం క్లాసులు పెట్టారు. ఎక్కువగా కంప్యూటర్ పైన పనిచేయడం ద్వారా నాకు బాగా తలనొప్పి వచ్చేది. ధ్యానం మొదలుపెట్టాక తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. దీని ద్వారా నాకు మానసిక ప్రశాంతత లభించింది. మైండ్ ఎప్పుడూ కూల్‌గా ఉండడం వల్ల పని పైన ఏకాగ్రత పెరిగింది. కోపం కూడా తగ్గిపోయింది. ఇంట్లో ఎంత పని చేసినా అలసట అనేదే రావడం లేదు.

 

సందేశం: ధ్యానం ద్వారా అందరం మానసిక ప్రశాంతతనూ మరి ఆనందాన్ని పొందుదాం .. మనమందరం ప్రతిరోజూ ధ్యాన సాధన చేద్దాం.

Go to top