" మనలోని జ్యోతిని వెలిగించుకుందాం"


పేరు: G.N లలిత కుమారి

హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ

 

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

అనవసరమైన ఆలోచనలు చెయ్యడం వల్ల మన శక్తి అంతా వృధా అవుతుంది. క్రమంగా మన వ్యక్తిగత నైపుణ్యం కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో మనం ఏ ప్రయత్నం చెయ్యకపోతే, ఏమీ సాధించలేమన్న భావంతో ఆత్మ నూన్యతకి లోనవడం జరుగుతుంది.

 

పిరమిడ్ ధ్యానం గురించి తెలియక ముందు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన మనస్సులో ఎప్పుడూ ఎడతెగకుండా ఆలోచనలు వస్తూ ఉండేవి. చాలా ఒత్తిడితో ఉండేదాన్ని .. నెగెటివ్ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉండేవి. నాలోని ఈ పరిస్థితి నాకు తెలుస్తూనే ఉన్నా .. ఏం చెయ్యాలో, ఏం చేస్తే నేను మామూలు స్థితికి వస్తానో తెలిసేది కాదు.

 

శ్రీమతి సూర్యప్రభ గారు ఒకసారి "పిరమిడ్ మెడిటేషన్" గురించి చెప్పడం, సచివాలయంలో భోజన విరామ సమయంలో మాతో ధ్యానం చేయించడం జరిగింది. అలా నేను పిరమిడ్ ధ్యానం మొదలుపెట్టిన రోజే నాకు ప్రశాంతత వచ్చింది. అప్పటి నుండి నాలో చాలా మార్పు వచ్చింది. ఆలోచనలు తగ్గాయి, ఒత్తిడి నుండి మెల్లిగా బయటపడ్డాను. వ్యక్తిగత నైపుణ్యం, మంచి ఏకాగ్రత వచ్చాయి. అహంకారం, కోపం తగ్గి .. ఓర్పు మరి స్నేహభావం పెరిగింది. ఇతరుల విజయాలను ఆనందించగలిగే స్థితి వచ్చింది.

 

ధ్యానంతో పాటు మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదువుతూ ఉన్నాను. తద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను. ధ్యానం క్రమం తప్పకుండా చెయ్యడానికి ఇది దోహదపడుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

 

సందేశం: ధ్యానం ద్వారా అనవసర ఆలోచనలు తగ్గి మనలో జ్యోతిని మనం తెలుసుకోవచ్చు. కనుక మనమందరం ధ్యానం చేద్దాం .. మనలోని జ్యోతిని వెలిగించుకుందాం.

Go to top