" ధ్యానం చేద్దాం .. మనల్ని మనం తెలుసుకుందాం "

 

పేరు : G.లక్ష్మి
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : రెవెన్యూ

 

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

"ధ్యానం" అనే పదం వినగానే "అది మనకు సాధ్యం కాని పని" అనుకుంటారు. "ధ్యానం అంటే తపస్సు, నియమం, కఠినం మరి అసాధ్యం" అనుకుంటారు. కానీ అది సాంఘిక జీవనంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ఆ తరువాత ధ్యానంలో పొందే అనుభవాల ద్వారా దానిని చేయడం కొనసాగిస్తారు. అలాగే ధ్యానం చేయమని మరికొంత మందికి చెప్తారు.

 

ధ్యానం చేయడం వలన ఏవేవో అతీంద్రియ శక్తులు మనల్ని, మన కర్మలను మార్చివేస్తాయని నేను చెప్పను. కానీ "మనలో ఉన్న సర్వసామాన్య శక్తులన్నింటినీ బయటకు వచ్చేలా చేస్తుంది; మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది" అన్నది మాత్రం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న నిజం. మొదట మనం ఏమిటో మనం అర్థం చేసుకుంటాం. తద్వారా మనం ఏమిటో ప్రపంచానికి తెలియచేసే అవకాశం లభిస్తుంది.

 

నాకు తెలిసినది, ధ్యానం అంటే .. ఆత్మను, మనస్సును సమన్వయం చేసే ఒక ప్రక్రియ, అంటే మంచి-చెడు విచక్షణ తెలియచేసే ఒక పరిణామ క్రియ.

 

సందేశం: మనమంతా కనిపించని భగవంతుడిని నమ్ముతాం .. మనలో ఉండే శక్తిని నమ్మం. మనలో శక్తి తెలియాలంటే మనకు మనమే గురువుగా ధ్యానం చేయాలి. ఏ పని జరగాలన్నా ముందు మన ప్రయత్నం చేయాలి. ధ్యానం మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం. మనమందరం ధ్యానం చేద్దాం .. మనల్ని మనం తెలుసుకుందాం.

Go to top