" మనలోని దైవత్వాన్ని తెలుసుకుందాం "

 

 

పేరు: N.V.R. ప్రసాద్
హోదా: సూపర్‌వైజర్
విభాగం : టెలిఫోన్ ఎక్ఛేంజ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను పూజలు బాగా చేస్తాను. అభిషేకాలు గంటకు తక్కువ కాకుండా చేస్తాను. ఒక్కసారి పూజ మొదలుపెట్టిన తరువాత మధ్యలో ఆపకుండా మొత్తం పూజతంతు అంతా అయ్యేదాకా అది ఎన్ని గంటలైనా కానీయండి చేస్తాను. పూజ చేసాకే మిగిలిన అన్ని పనులు చేస్తాను. గుళ్ళు, గోపురాలు మరి తీర్థయాత్రలు ఎక్కువగా తిరుగుతాను. అవి చేస్తేనే నా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.

 

మా ఆఫీసులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీమతి సరోజ ద్వారా ఒకరోజు నాకు ధ్యానం పరిచయం అయ్యింది. ఆవిడ ఎప్పుడూ చెబుతూ ఉండేది కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానమని, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానమని మరి కోటి జపాలు ఒక ధ్యానానికి సమానమని. అందుకే నాకు ధ్యానం చెయ్యమని చెప్పేది. "తను ఇంతలా చెప్తోంది కదా, ఒకసారి ధ్యానం చేసి చూద్దాం" అనుకుని ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను.

 

ధ్యానం చెయ్యడం ద్వారా నేను ఎంతో ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను పొందాను. పూజలలో, జపాలలో, స్తోత్రాలలో మనం బాగా మన ఎనర్జీనీ, డబ్బునూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ మనం ఎలాంటి పని చెయ్యకుండా ఉండడాన్నే ధ్యానం అంటారు. దాని వలన మన శరీరంలో ఉన్న శక్తి ఖర్చు కాకుండా ఉండడమే కాకుండా ఎంతో శక్తిని పొందుతామని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను.

 

సందేశం : అందరూ విగ్రహాలలో దేవుడిని వెతకకుండా .. ధ్యానం ద్వారా తనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకుని తమ జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.

Go to top