"  ఏదైనా సాధించగలను" 

 

 

పేరు: K.శ్రీనాథ్
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : పంచాయతీరాజ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నా వయస్సు 35 సంవత్సరాలు. గత మూడు నెలలుగా "శ్వాస మీద ధ్యాస" ధ్యానం చేస్తున్నాను. అంతకు ముందు ఎప్పుడూ లేనిది నాలో అనేక మార్పులు కనిపించాయి. అంతకు ముందు ఒక పని చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలు వచ్చేవి. కానీ ప్రస్తుతం అలాంటి ఆలోచనలు రావడం లేదు. ఏ పనినైనా పూర్తి ఏకాగ్రతతో చేస్తున్నాను.

 

నేను ఉదయం ఒక గంట, రాత్రి ఒక గంట ధ్యానం చేస్తాను. ఉదయం, రాత్రి చేసే ధ్యానం నాకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. నాలో ఏదో ఒక శక్తి. ఉత్తేజం వచ్చిన అనుభూతి కలుగుతుంది. మా O.P సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి రమ్యా మేడమ్ ధ్యానం విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చారు.

 

నేను ఈ విధంగా రోజూ సంతోషంగా, మంచి ఎనర్జీతో ధ్యానం చేస్తున్నాను. నాకు మంచి ఫలితం కనిపించింది. ఇది నా స్వానుభవంతో తెలుసుకున్నాను.

 

సందేశం: మనమందరం ధ్యానం చేద్దాం .. ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పొందుదాం.

Go to top