" షుగర్ పూర్తిగా తగ్గిపోయింది "

 

 

పేరు: T.రమాదేవి
హోదా: రికార్డు అసిస్టెంట్
విభాగం : పశు సంవర్ధక

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ఆరు నెలలు నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. నాకు ఎంతో మంది ధ్యానం గురించి చెప్తూండేవారు. నేను వినేదాన్ని కాదు. ఒక రోజు మా ఫ్రెండ్ సరోజిని "ధ్యానం చేద్దాం .. ఆరోగ్యం బాగుంటుంది" అని బలవంతం చేస్తే నాకు ఇష్టం లేకపోయినా మా స్నేహితురాలి మాటను కాదనలేక, ఆమెని బాధపెట్టలేక వెళ్ళాను.

 

ఆ రోజు ధ్యానంలో కూర్చున్నాను. మొదట్లో పిచ్చి పిచ్చిగా అనిపించింది. తరువాత కొంత సేపయ్యాక అన్ని రంగులు, రంగులుగా ఒక 20 నిమిషాల దాకా కనిపించాయి. తరువాత మెల్లగా ఒక కాంతి వెలుగుతూ గుండ్రంగా, విష్ణుచక్రంలాగా తిరుగుతూ ఒక 40 మీటర్ల దాకా కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ధ్యానంలో ఇంత మంచి అనుభవాలు వస్తాయని అనుకోలేదు. ఆ రోజు ఎంత సంతోషంగా అనిపించిందో మాటలలో చెప్పలేను.

 

నాలుగవ రోజు ధ్యానంలో అంతా పచ్చగడ్డి, ఆ గడ్డిలో రకరకాల పక్షులు, ఎన్నో రంగులలో అందమైన పక్షులు కనిపించాయి. అన్ని రంగుల పక్షులను నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఈ అనుభవం మాటల్లో చెప్పలేను .. అంత బాగుంది. ఇంకొకసారి నాకు ధ్యానంలో పచ్చగడ్డి, ఆ గడ్డిలో రెండు నల్లటి తాళ్ళు పెనవేసుకుంటూ నాలో నుంచి బయటికి దొర్లుకుంటూ వెళుతున్నట్లు అలా 40 నిమిషాల దాకా కనిపించింది.

 

ఈ అనుభవం కలిగన తరువాత నాకు వున్న రోగాలు, చెయ్యి నొప్పి, తలనొప్పి, కాళ్ళనొప్పులు, కొలెస్ట్రాల్ తగ్గడం, బరువు తగ్గడం మరి షుగర్ అన్నీ తగ్గిపోయాయి. నాకు షుగర్ 374 వుండేది. ధ్యానం చేసిన తరువాత ఎన్నిసార్లు పరీక్ష చేయించుకున్నా ‘నిల్’ రిపోర్ట్ వచ్చింది. ధ్యానంలోకి రాకముందు అనారోగ్యంతో ఎంతో బాధపడేదాన్ని. ధ్యానం చేసాక ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి. ఒక్క టాబ్లెట్ కూడా వాడట్లేదు. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది.

 

సందేశం: మనమందరం ధ్యానం చేద్దాం. ఏ టాబ్లెట్, డాక్టర్స్, ఇంజక్షన్స్ అవసరం లేకుండా ఆనందంగా జీవిద్దాం.

Go to top