" శాకాహారమే సరియైన ఆహారం "

 

పేరు: D.జగదీశ్వరి
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : సోషల్ వెల్‌ఫేర్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను పూజలు చేస్తూ, విష్ణుసహస్రనామం, లలితా సహస్రనామం పారాయణం చేసుకునేదానిని. 'S.S.Y' యోగాలో చెప్పినట్లుగా మనస్సులో ఒక మంత్రాన్ని స్మరించి ధ్యానం చేసేదాన్ని. నేను గత ఆరునెలలుగా పిరమిడ్ ధ్యానం చేస్తున్నాను. "ధ్యానంలో ఇంతటి సులువైన మార్గం వుందా" అనిపించింది. మొదట్లో ధ్యానంలో మనస్సు సరిగ్గా నిలబడకపోయినా, క్రమక్రమంగా ధ్యానం పై ఏకాగ్రత కుదిరేది. ధ్యానం చేసుకోవాలనే తపన మనస్సులో కలిగేది. ధ్యానం అరగంట చేస్తే మనస్సు తేలికై, రోజంతా చురుకుగా వుండగలిగేదాన్ని. ఇంట్లో, కార్యాలయంలో పనిభారం ఎక్కువైనా .. చిరాకు పడక ఓర్పుగా చేసుకోవడం అలవడింది.

 

భర్త కోపంతో ఏవైనా పరుషవాక్కులు పలికినా, మునుపటిలా ఎదురు సమాధానం చెప్పకుండా, "నిదానంగా తెలుసుకుంటారులే" అని మౌనం పాటించడం అలవడింది. అందరిపట్ల ప్రేమ, దయ మరి ఆత్మీయత అనేది ధ్యానం వలన పెంపొందుతాయని తెలిసింది. నేను పిరమిడ్ మెడిటేషన్ తెలియక మునుపే చాలా సంవత్సరాల నుండి శాకాహారిగా మారాను. జీవహింస పాపమని తలంచి, శాకాహారిగా మారడం చాలా మంచిదని పిరమిడ్ ధ్యానం వలన తెలుసుకున్నాను. పిరమిడ్ ధ్యానం వలన మంచి ఆరోగ్యం పొందవచ్చునని, మానసిక శాంతిని పొందవచ్చని మరి మంచి మానవతా గుణాలు అభివృద్ధి చెందుతాయని తెలిసింది. ఇటువంటి ధ్యాన మార్గాన్ని బోధించి, ధ్యాన ప్రచారం చేస్తున్న బ్రహ్మర్షి పత్రీజీకి నమస్సుమాంజలులు.

 

సందేశం: ప్రతి జీవినీ మన పిల్లల్లాగా చూసుకుందాం, అన్ని జీవుల పట్ల ప్రేమను చూపుదాం. సర్వం రక్షిద్దాం .. వృక్షప్రపంచాన్నీ, జంతు ప్రపంచాన్నీ.

Go to top