" ఉద్యోగులందరం ఐకమత్యంగా ఉంటున్నాం "

 

 


పేరు: D.స్వర్ణ రాజు

హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : పంచాయతీ రాజ్

 

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.


సచివాలయంలో నిత్యం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. మన రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి గౌరవ ముఖ్యమంత్రి మరి రాష్ట్ర మంత్రుల మదిలోని ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చే బాధ్యత I.A.S అధికారులది. వారందరి ఆలోచనలను కార్యాచరణ మార్గంలోకి తేవడానికి ఎందరో సీనియర్ అధికారులు మరి ఇతర అధికారులందరూ పాలు పంచుకుంటూ నిత్యం ఎంతో పని ఒత్తిడితో తమ గురించి ఆలోచించుకోకుండా పని చేస్తూ ఉంటారు. ఇలాంటి, మా అందరికీ ఎంతో మంచి జరగాలనే ఉద్దేశ్యంతో సచివాలయంలో ధ్యానాన్ని బోధిస్తున్న పిరమిడ్ మాస్టర్సందరికీ నా ఆత్మ ప్రణామాలు.

 

ఉన్నతాధికారుల సహకారంతో భోజన విరామ సమయంలో ధ్యానం చేయడం ద్వారా నాకు మానసిక ఆనందం కలుగుతోంది. ముఖ్యంగా ధ్యానం చేయడం ద్వారా ఎవరి త్రోవన వారుగా ఉండే ఉద్యోగినీ ఉద్యోగులందరూ ... ఎంతో ఐకమత్యంగా ఉండడం ఒక మంచి సాంప్రదాయంగా భావిస్తున్నాను. పది మంది మంచి మనుష్యులు ఒకచోట చేరి ధ్యానం చేసి ధ్యానామృత ఫలాలను తమ కొరకు, తమవారి మేలు కొరకు ఉపయోగించుకోవటానికి ధ్యానం అత్యుత్తమైన మార్గం. గత నలభై రోజులుగా ధ్యానం చేస్తూ, ధ్యానామృతాన్ని స్వీకరిస్తున్నాను. నిత్యం పని ఒత్తిడిలో ఉండే మాకు మధ్యాహ్నం ఒంటిగంట ఆయ్యేసరికి నా కాళ్ళు ధ్యానం చేసే మందిరం వైపుకి వాటంతట అవే పరుగులు పెట్టడం నాకే ఆశ్చర్యం కలిగేంత మార్పు.

 

సందేశం: మానసిక ఆందోళన, పని ఒత్తిడులు లాంటివి దూరంగా పెట్టి "ధ్యానాంధ్రప్రదేశ్" గా రాష్ట్రాన్ని మార్చాలనే బ్రహ్మర్షి పత్రీజీ సత్సంకల్పానికి మార్గం సుగమం చేయాలనే గట్టి సంకల్పంతో, రాష్ట్రానికి అతి ముఖ్యమైన సచివాలయాన్ని ధ్యాన సచివాలయంగా మార్చడానికి మేమందరం కలిసి కృషి చేయాలన్నదే మా అందరి ఆశయం, ఆకాంక్ష.

Go to top