" ధ్యాన - జ్ఞాన సాధన "

 

 

పేరు: T.V.రామ సువర్చల
హోదా: సీనియర్ స్టెనో
విభాగం : ట్రైబల్ వెల్‌ఫేర్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

మేము సచివాలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ముప్ఫై నిమిషాలు ధ్యానం చేస్తున్నాం. ధ్యానానంతరం నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటోంది. ఒక రాత్రంతా నిద్రపోయి ఉదయం లేచినప్పుడు మనస్సు ఎంత ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుందో ముప్ఫై నిమిషాలు ధ్యానానంతరం అంతే ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది.

 

మేమంతా సామూహికంగా చేసే ధ్యానం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ధ్యానం ద్వారా భౌతికంగా అత్యధిక స్థాయిలో విశ్రాంతి లభిస్తుంది. ధ్యానం వల్ల శారీరక, మానసిక శక్తి, సామర్థ్యాలు మెరుగుపడటమే గాక మెదడు సక్రమంగా, చురుకుగా పని చేసి సత్ ప్రవర్తనకు సహాయపడుతుంది. ధ్యానం ద్వారా ఏకాగ్రతను మెరుగుపరచుకోవడమే కాక, ప్రవర్తనను పరిశుద్ధం చేసుకోవచ్చు. ధ్యాన సాధన అనంతరం నాలో ఎంతో మార్పు కలిగి .. చేస్తున్న ఉద్యోగంలో నేను ఆనందాన్ని పొందుతున్నాను. ధ్యానం శాంతియుతంగా మెరుగుపరచి, అహంభావాన్ని విడనాడడానికి దోహదపడుతుంది.

 

ధ్యాన మార్గాన్ని బోధించి, ధ్యాన ప్రచారం చేస్తూన్న బ్రహ్మర్షి పత్రి గారికి నమస్సుమాంజలులు.

 

సందేశం: మనలోని శక్తిని తెలుసుకొని దేనినైనా సాధించగల శక్తి ధ్యాన-జ్ఞాన సాధనతో మాత్రమే సాధ్యం. మనం ఎల్లప్పుడూ శాంతియుతంగా, సంతోషంగా ఉంటూ ప్రేమతత్వాన్ని పెంచుకొని .. సమయానుకూలంగా మరి సంయమనంగా ఉందాం. ఇది ధ్యానం ద్వారా తప్పక సాధ్యమవుతుంది. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

Go to top