" ధ్యానమే ఒక పెద్ద డాక్టర్ "

 

 

పేరు: V. చంద్రరావు
హోదా: ప్రైవేట్ సెక్రెటరీ
విభాగం : పంచాయతీ రాజ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యానం ప్రారంభించిన తొలిరోజులలోనే కాంతి పుంజాలు, రంగులు కనిపించేవి. నాకు ఒక రోజు తీవ్రంగా నడుమునొప్పి వచ్చింది దానికి డాక్టర్ గారు మందులిచ్చారు. కానీ ఆ తరువాత "ఆర్థోపెడిక్ స్పెషలిస్టుకి చూపించుకోవాలి" అన్నారు. నేను ఆ తరువాత రోజు మధ్యాహ్నం ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు వెన్నెముక క్రింద భాగంలో నొప్పి నుండి ఉపశమనం కలుగుతున్నట్లు అనుభూతిని పొందాను. ఇలా మూడు రోజులు జరిగింది. ఈ అనుభూతి కేవలం ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే కలిగేది. మూడు రోజులలో నొప్పి పూర్తిగా పోయి .. ఇప్పటి దాకా మళ్ళీ రాలేదు.

 

ధ్యానం ప్రారంభించి నెల రోజులు గడిచిన తరువాత ఒకరోజు మా అమ్మాయి, "డాడీ! మీ ముఖంలో కలర్, గ్లో వచ్చాయి" అనింది .. "దానికి కారణం ధ్యానమే" అన్నాను.

 

సందేశం: అందరూ ఆనందంగా మరి ఆరోగ్యంగా జీవించాలంటే ధ్యానమే శరణ్యం మనమందరం ధ్యానం చేద్దాం .. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం.

Go to top