" విపరీతమైన తలనొప్పి తగ్గిపోయింది "

 

 

 

పేరు: K.సరళాదేవి
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను గత రెండు నెలల నుండి ధ్యానం చేస్తున్నాను. దానివల్ల ఒత్తిడి, కోపం మరి చిరాకు బాగా తగ్గిపోయాయి. నాకు ఆరోగ్యం చక్కబడింది. విపరీతమైన తలనొప్పి బాగా తగ్గిపోయింది. మనస్సు ఆహ్లాదకరంగా, తేలికగా ఉంటోంది. ప్రతి చిన్న విషయానికీ బాధపడటం తగ్గి .. హాయిగా వుంటున్నాను.

 

మా ఇంటి దగ్గర జరిగిన పదకొండు రోజుల ధ్యానం క్లాసులలో సీనియర్ మాస్టర్స్ ఇచ్చిన సందేశాలు, వారి అనుభవాలు విని చాలా విషయాలు తెలుసుకున్నాను. మొదటిసారి బ్రహ్మర్షి పత్రీజీని శిల్పారామంలో కలిసినప్పుడు చాలా ఆనందం పొందాను. "ఇంత చక్కటి సులువైన ధ్యానం మరి సద్గురువు సాంగత్యంలో గడపడం నా పూర్వజన్మ సుకృతం" అనిపిస్తోంది.

 

మా అమ్మగారు చక్కగా ధ్యానం చేసి .. వారు ఆరోగ్యాన్ని పొంది ప్రశాంతంగా ఉన్నారు. ధ్యానం, స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యం వలన జీవితం ఆనందభరితం కాగలదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ధ్యానం అందరికీ తెలియజేయడం ద్వారా ఎంతో తృప్తి పొందుతున్నాను. ఎంతో శ్రమతో, సేవా దృక్పథంతో ధ్యానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారికి మా యొక్క కృతజ్ఞతలు.

 

సందేశం : నేను ధ్యానం చేసి ఆనందంగా జీవిస్తున్నాను. ధ్యాన ప్రచారం చేస్తూ మరింత ఆనందంగా జీవిస్తున్నాను. మనమంతా ధ్యానం చేద్దాం .. ధ్యానాన్ని అందరికీ తెలియజేద్దాం.

Go to top