" ఆనందంగా జీవిద్దాం "

 

 

 

పేరు: N.B.రత్నకుమార్
హోదా: డిప్యూటి సెక్రెటరీ
విభాగం : మెడికల్ అండ్ హెల్త్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.


2009 నవంబర్‌లో నాకు గుండెనొప్పి వచ్చింది. హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత నాకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. నాకు తరచుగా జలుబు వచ్చేది. మా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి సుజాత మేడమ్ ద్వారా నేను పిరమిడ్ ధ్యానం తెలుసుకున్నాను.

 

నేను ధ్యానం ప్రారంభించాక నా ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చాయి. నాకు తరచుగా వచ్చే జలుబు తగ్గిపోయింది. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. ఏ రోజైతే నేను ధ్యానం చేయనో ఆ రోజంతా ఇబ్బందిగా ఉండేది. హయ్యర్ ఆఫీసర్స్‌తో మీటింగులలో పాల్గొని వచ్చాక నాకు చాలా డిస్ట్రబెన్స్‌గా వుండేది. అప్పుడు ధ్యానం చేయటం ద్వారా ఎంతో హాయిగా ఫీలవుతాను. నా అండర్‌లో పనిచేస్తున్న ఒక సెక్షన్‌లోని సెక్షన్ ఆఫీసర్‌కు మరి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కు ధ్యానం గురించి చెప్పాను. అప్పుడు వారిద్దరూ చాలా నవ్వారు. నన్ను ఎగతాళి చేశారు. కానీ కొన్ని నెలల తర్వాత ఆ నవ్విన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరే ధ్యానం మొదలుపెట్టాడు. ఇప్పుడు తాను ధ్యానం వలన అనుభవిస్తున్న ప్రశాంతతను తెలుసుకొని ఆ రోజు తాను నవ్వినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు.

 

సందేశం : మన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మనమందరం ధ్యానం చేద్దాం, ఆనందంగా జీవిద్దాం.

Go to top