" నెగెటివ్ ఆలోచనలు పోయాయి "

 

 

 

పేరు : O.G. రాధ
హోదా: అసిస్టెంట్ సెక్రెటరీ
విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను ధ్యానం చేస్తున్నప్పటి నుండి నాకు చాలా మనశ్శాంతిగా ఉంటోంది. ఒక్కరోజు ధ్యానం చేయకపోతే కనుక "ధ్యానం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి" అనిపిస్తుంది. "ఇంత మంచి ప్రయోజనాలు ఉన్న ధ్యానాన్ని నలుగురికీ చెప్పాలి; వారిచేత ధ్యానం చేయించాలి" అనిపిస్తుంది. అలాగే నా దగ్గరికి వచ్చిన వారికి ధ్యానం గురించి, దాని అవశ్యకత గురించి చెప్తున్నాను.

 

నేను ఇంట్లో ధ్యానంలో కూర్చున్నప్పుడు నన్ను చూసి నా పిల్లలు కూడా వచ్చి నా ప్రక్కన కూర్చుని ధ్యానం చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా పిల్లలు చిన్న వయస్సు నుండే ధ్యానం చేయడం చూసి పిరమిడ్ ధ్యానం గురించి నా భర్తకి కూడా చెప్పాను. వారు కూడా ధ్యానం చేస్తున్నారు.

 

"పిరమిడ్ మాస్టర్స్ యొక్క క్లాసెస్‌కి వెళ్ళాలి, వారి ప్రవచనాలు వినాలి" అని బాగా అనిపిస్తుంది. అదే విధంగా ఎప్పుడైనా ఎక్కడైనా పిరమిడ్ మాస్టర్స్ క్లాసులు జరుగుతున్నప్పుడు నేను ఆ క్లాసులకు హాజరు అవుతున్నాను. ధ్యానం చేస్తున్నప్పటి నుండి నాకు చాలా రిలీఫ్‌గా ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా నాలోని నెగెటివ్ అలోచనలు పూర్తిగా తగ్గిపోయాయి. పాజిటివ్ ఆలోచనలే వస్తున్నాయి.

 

సందేశం : ధ్యానం చేయటం మూలంగా నేను ఎంతో ప్రశాంతంగా,ఆనందంగా నా జీవితాన్ని గడుపుతున్నాను. అందరం ధ్యానం చేద్దాం. ఆనందంగా జీవిద్దాం. ఇంత మంచి జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనకందరికీ అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీకి నా యొక్క ఆత్మాభివందనాలు.

Go to top