" ప్రస్తుతంలో జీవించడం నేర్చుకున్నాను "

 

 

 

పేరు: J.S. శేఖర్
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : పంచాయతీరాజ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

గత రెండు నెలల నుండి నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం ద్వారా నాలో ఎంతో మార్పు వచ్చింది. మానసిక ఆందోళన తగ్గింది. శారీరకంగా చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటున్నాను. కోపం, భయం తగ్గిపోయాయి. జరిగిపోయినదాని గురించి, జరగబోయేదాని గురించి ఆలోచించకుండా ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం నేర్చుకున్నాను. ఆరోగ్యం చాలా మెరుగయ్యింది.

 

ధ్యానం అందరూ చేసి లాభం పొందాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ధ్యానం "సర్వరోగ నివారిణి" ... "సకలభోగకారిణి".

 

సందేశం: చాలా సంవత్సరాల నుంచి నాలో వున్న మానసిక ఆందోళన, అనారోగ్యం, భయం మరి కోపం అనేవి రెండు నెలల ధ్యానంతోనే పూర్తిగా తగ్గిపోయాయి. లక్షల లీటర్ల పాలకు కొంచెం పెరుగును తోడు చేస్తే పాలు అంతా పెరుగు అవుతుంది. అలాగే మన పాలలాంటి జీవితానికి పెరుగులాంటి ధ్యానాన్ని తోడు చేస్తే ఇక జీవితం అంతా ఆనందమే కదండీ. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

Go to top