" మాకుటుంబం అంతా ధ్యానమయం " 

 

 

 

పేరు: I. సుహాసిని
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : ప్లానింగ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను ధ్యానం చేయడం వలన చాలా లాభాలు పొందుతున్నాను. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నేను ధ్యానం చేస్తున్నాను. అందువలన మనస్సు ప్రశాంతంగా చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. నేను, నా భర్త మరి మొత్తం కుటుంబమంతా కలిసి రోజూ ధ్యానం చేస్తున్నాం. నా ఆరోగ్యం చాలా కుదుటపడింది. మా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నాము.

 

సచివాలయంలో భోజన విరామ సమయంలో మేమంతా ధ్యానం చేస్తూంటాం. 41 రోజులు భోజన విరామ సమయంలో ధ్యానం చేశాను. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. చక్కగా పని చేయగలుగుతున్నాను. ఆనాపానసతి పద్ధతిని తెలిపిన జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీకీ నా ఆత్మ ప్రణామాలు. "ఆయన దారిలోనే వెళ్ళాలి" అని గట్టిగా నిర్ణయించుకుని నిత్యం ధ్యానం చేస్తున్నాను. తెలిసిన వారందరికీ తప్పక ధ్యానం చేయమని చెబుతున్నాను.

 

సందేశం: మనమంతా ధ్యానం చేద్దాం .. మన సద్గురువుతో మన జీవితాలను ధన్యం చేసుకుందాం

Go to top