" ధ్యానం వల్లనే ఆనందం "

 

 

 

పేరు: D. అచ్యుత కుమారి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : స్కూల్ ఎడ్యుకేషన్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు

 

సెక్రెటేరియట్‌లో జరుగుతున్న ధ్యానం క్లాసులకు గత రెండు నెలల నుంచి హాజరవుతున్నాను. ధ్యానం చేస్తున్నప్పటి నుంచి నా మనస్సంతా చాలా ప్రశాంతంగా, ఏదో తెలియని ఆనందంగా ఉంది. నేను ఇంటి పనులు, ఆఫీసులో పనులు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా సక్రమంగా చేయగలుగుతున్నాను. నేను పూర్తి చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతున్నాను.

 

ధ్యానాభ్యాసం ద్వారా మన జీవితాన్ని మరింత ఉన్నతంగా, ఆనందంగా, ప్రశాంతంగా మరి ఆరోగ్యవంతంగా మలచుకోవచ్చునని నా స్వానుభవం ద్వారా తెలుసుకున్నాను.

 

సందేశం: మనమందరం ధ్యానం చేద్దాం. నిత్యం ఆనందంగా జీవిద్దాం.

Go to top