" పిరమిడ్ జగత్‌ను స్థాపిద్దాం "

 

 

పేరు: P. శ్రీకృష్ణ
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : పంచాయతీరాజ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

‘ఆనాపానసతి’ ధ్యాన పద్ధతిని మనందరికీ అందించిన బ్రహ్మర్షి పత్రీజీకి పాదాభివందనాలు సమర్పిస్తున్నాను.

 

ధ్యానం చేయటం వలన నేను చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. ఆలోచనా పరంపరలు మొదట చాలా ఎక్కువగా ఉన్నా, క్రమేపీ తగ్గుతున్న అనుభూతి పొందుతున్నాను. నేను చేసే పనిలో చురుకుదనం, నైపుణ్యం పెరిగింది. సామూహిక ధ్యానం చేసేటప్పుడు శక్తి చాలా ఎక్కువగా పొందుతున్నాను. అలాగే పిరమిడ్ క్యాప్ పెట్టుకుని ధ్యానం చేస్తున్నప్పుడు శక్తి ప్రవాహం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నేను మొదటి నుంచి భక్తి మార్గంలో ఉన్నా .... ధ్యానం చేయటం మొదలు పెట్టాకే ఆరోగ్యం, మానసిక శాంతి మరి సమదృష్టి పెంపొందినట్లు గమనించాను.

 

ధ్యాన కార్యక్రమాన్ని మన సచివాలయంలో ప్రవేశపెట్టిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు.

 

ప్రతి ఒక్కరూ పిరమిడ్ క్యాప్ ఉపయోగించాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో పిరమిడ్ ఉండాలి. ప్రతి కాలనీలో పిరమిడ్ ఉండాలి. పిరమిడ్‌లో ధ్యానం మూడు రెట్లు అధిక శక్తివంతంగా ఉంటుంది. రకరకాల పిరమిడ్స్‌ను మాకు అందిస్తున్న పిరమిడ్ మాస్టర్స్‌కు ఆత్మాభివందనాలు.

 

సందేశం: మనమందరం పిరమిడ్స్‌ను ఉపయోగించుకుందాం. పిరమిడ్ జగత్‌ను స్థాపిద్దాం.

Go to top