" జీవన విధానాన్ని మెరుగు పరుచుకుందాం "

 

 

పేరు: D.ఇందిరా రాణి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం: హోం

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

సచివాలయంలో ధ్యాన సాధన ద్వారా పరిపూర్ణ జీవితాలను గడపగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన పిరమిడ్ మాస్టర్స్‌కు ముందుగా కృతజ్ఞతలు.

 

చాలా మానసిక అనారోగ్య సమస్యలతో వున్న నేను ధ్యానం చేయటంతో ఎంతో ప్రశాంతతతో పాటు ఎంతో ఓర్పును, సంపూర్ణ ఆరోగ్యం కూడా పొందగలిగాను. ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా అన్ని పనులను ప్రశాంతంగా, సంతోషంగా చేసుకోగలుగుతున్నాను.

 

"శ్వాస మీద ధ్యాస" అనే ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక భావాలతో, మానసిక ప్రశాంతతతో ఆరోగ్యవంతంగా, ఆనందంగా జీవిస్తున్నాను.

 

సందేశం: ప్రతిరోజూ ధ్యాన సాధన చేయడం ద్వారా మన జీవన విధానాన్ని మెరుగు పరచుకుందాం. మనమందరం ధ్యానం చేద్దాం.

Go to top