" ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి "

 

 

పేరు: N. సుధాకరరావు
హోదా: ప్రైవేట్ సెక్రెటరీ
విభాగం: పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.


‘ధ్యానం’ వలన ఎంతో మేలు జరుగుతుంది. ధ్యానం గురించి నాకు 1998 వ సంవత్సరంలో ఆఫీసర్ గౌ||లు. శ్రీ C.ఆంజనేయరెడ్డి,I.F.S (రిటైర్డ్) గారి ద్వారా తెలిసింది. వారి సూచనల మేరకు "విపస్సన ధ్యాన కేంద్రం", వనస్థలిపురంలో పది రోజులు ధ్యానాన్ని చేశాను. ఆ తరువాత కొన్ని నెలలు ఇంట్లో చేశాను. కాలక్రమంలో ధ్యానానికి దూరమయ్యాను.

 

మరలా 2010 సంవత్సరంలో P.A. డిపార్ట్‌మెంట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా చేరాను. శ్రీమతి లీల గారు ధ్యానం గురించి చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. మన సచివాలయం సరైనా మార్గాన్ని ఎంచుకుందనిపించింది. ఇక్కడ ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రభుత్వం వారు 2000 సంవత్సరంలో ఈ క్రింది రెండు జీ.ఓ.లు జారీ చేశారు.

 

1. జీ.ఓ.యమ్.యస్. నం. 317,జి.ఏ. (ఏ.ఆర్.అండ్ టి.111), తేదీ 8-9-2000


2. జీ.ఓ.యమ్.ఎస్.నం. 351, జి.ఏ.(ఏ.ఆర్.అండ్ టి.111), తేదీ 18-10-2000.

 

పైన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులకు (వయస్సు, కేడర్, ఎలిజిబిలిటీ)10 రోజులు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇచ్చి "విపస్సన ధ్యాన కేంద్రం " లో "విపస్సన మెడిటేషన్" పది రోజులు కోర్సుకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ ఉత్తర్వుల వలన ఎవ్వరికీ ఎలాంటి మేలూ జరుగలేదు. నేడు మనమందరం ఎదుర్కొంటున్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక, వృత్తిపరమైన ఒత్తిడులను సులభంగా అధిగమించడానికి పిరమిడ్ ధ్యానం అత్యవసరం. కనుక ప్రభుత్వం వారు పై ఉత్తర్వులను సవరించి కనీసం నాలుగు రోజులు ప్రత్యేక క్యాజువల్ సెలవు ప్రతి ఉద్యోగికి ఇచ్చి పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో నాలుగు రోజులు ధ్యాన తరగతులను నిర్వహిస్తే చాలా మేలు సమాజానికి జరుగుతుందనుకుంటాను.

 

సందేశం: నా అనుభవంతో చెప్పాలంటే ... మనిషికి భోజనం ఎంత అవసరమో - ‘ధ్యానం’ అంతకన్నా ఎక్కువ అవసరం. ‘ధ్యానం’ లేకపోతే జీవం లేదు. ధ్యానమే జీవం -బలం. మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ప్రకృతిని కాపాడుకోడానికి ‘ధ్యానం’ అత్యవసరం.

Go to top