" పంచభూతాల కలయికే పిరమిడ్ "

 

 

నా పేరు "కిషోర్". 2005లో శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుని అనుగ్రహంతో పిరమిడ్ ధ్యానంలోకి నా మహాప్రవేశం జరిగింది. ఆరోజు నుంచి దినదినాభివృద్ధితో ఆధ్యాత్మిక జ్ఞానంతో అనేకానేక అనుభూతులతో దేదీప్యమానంగా సాగరతీరం నుంచి హిమాలయాల మీదుగా అలుపెరగని నిరంతర బాటసారినై, గమ్యం లేని గమనంతో నేను శూన్యస్థితిలో ప్రయాణం చేస్తున్నాను.

 

ధ్యానంలోకి వచ్చిన తొలిరోజులలో తుంబుర తీర్థం ట్రెక్కింగ్‌లో ధ్యానస్థితిలో ఉన్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి పిరమిడ్ శక్తిక్షేత్రాలు నిర్మించాలనే భావనలు నా మనస్సులో ప్రతిష్టించారు. నాలో కలిగిన ఆ భావనలు వాస్తవరూపంలో తీసుకుని రావడానికి పత్రీజీ పూర్తిగా సహకరించారు.

 

నేను వృత్తిరీత్యా వ్యాపారస్థుడిని. అది వదిలే స్వభావం నాలో లేదు. డా||G.K.గారు, పత్రిగారు ఇచ్చిన స్ఫూర్తితో వృత్తి వ్యాపారాలను ప్రక్కనపెట్టి పిరమిడ్ నిర్మాణంలో ముందుకు ప్రయాణం చేయడం జరిగింది. ఈరోజు యావత్ ప్రపంచంలో గుడుల కన్నా, మసీదుల కన్నా, చర్చీల కన్నా, గురుద్వారాల కన్నా పిరమిడ్‌లు ప్రాధాన్యతే ఎక్కువ. ఇది ముమ్మాటికీ సత్యం. ఈ నిర్మాణం సృష్టిలో వచ్చిన మార్పువల్ల మాత్రమే జరిగింది. "పిరమిడ్" అంటే పంచభూతాల కలయిక. పిరమిడ్‌లో పంచభూతాలు ఉంటాయి. ఒక్కొక్క కోణం ఒక్కొక్క తత్వానికి ప్రతీక.

 

ఈశాన్య కోణం - జలతత్వం
అగ్నేయ కోణం -అగ్నితత్వం
నైఋతి కోణం -భూతత్వం
వాయువ్య కోణం - వాయుతత్వం
శిఖర కోణం -ఆకాశ తత్వం

 

ఈ పంచకోణాల కలయికతో ఉన్నదే ఈ మహాశక్తిక్షేత్రం. మానవ శరీరం పాంచతత్వ భౌతిక శరీరం. ధ్యానస్థితిలో ఈ శక్తిక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ తత్వాలతో అనుసంధానం పొంది అనేకానేక దివ్య అనుభూతులు చెంది, మహాపరినిర్వాణ స్థితిని పొందుతారు. మానవులందరికీ మహాపరినిర్వాణ స్థితిని పొందటానికి పిరమిడ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. పిరమిడ్‌లు నిర్మించేవారు, నిర్మాణానికి సహకారం చేసేవారు PSSM లో మహా భాగస్థులు!

 

 


N.S. కిషోర్

విశాఖపట్టణం జిల్లా

+ 9199115 93304

 

Go to top