" ఆస్ట్రల్ సర్జరీతో స్పష్టమైన చూపు "

 

నా పేరు "కమలమ్మ". ఒకనాడు వ్యవసాయ కూలీగా బ్రతికిన నన్ను అనారోగ్యం కూడా ప్రతిక్షణం వెంటాడుతూండేది. 2006లో నా శరీరంలో షుగర్ లెవల్స్ 520 దాకా వెళ్ళగా డాక్టర్లు కోమాలోకి వెళ్ళిపోతావని చెప్పారు. మాటలు పడిపోయి ఆరేడు గంటలు స్పృహలో లేనప్పుడు డాక్టర్లు "చనిపోతుంది" అని చెప్పారట. కానీ నా కొడుకు ధ్యానంపై పూర్తిగా నమ్మకం ఉంచి నర్వ పిరమిడ్ మాస్టర్లతో సామూహికంగా సంకల్ప ధ్యానం చేయించడంతో రెండు గంటల్లోనే నేను యధావిధిగా కోలుకోవడం "పత్రీజీ పెట్టిన మరుజన్మ భిక్ష" అని ధైర్యంగా చెప్పగలను!

 

నాకు కంటిలో నీరు కారుతూ రెండునెలల పాటు రాత్రివేళల్లో నిద్ర వచ్చేది కాదు. హైదరాబాద్ LVప్రసాద్ కంటి ఆసుపత్రి కి తీసుకు వెళ్ళగా "కంటికి ఆపరేషన్ చేయాలి; 70 వేలు ఫీజు అవుతాయి" అని చెప్పారు.

 

నా కొడుకు ఆంజనేయరెడ్డి నన్ను ధ్యానంలో కూర్చోబెట్టి ఆస్ట్రల్ సర్జరీ జరగాలని సంకల్ప ధ్యానం చేయించడంతో నాకు ధ్యానంలోనే బ్రహ్మర్షి పత్రీజీ మరి కొందరు ఆస్ట్రల్ మాస్టర్స్ ఆస్ట్రల్ సర్జరీ చేయడం జరిగింది!

 

కంటిలో నీరు కారడం ఆగడంతో పాటు అంతవరకు మందంగా ఉండే నా చూపు మరింత స్పష్టం అయ్యి ప్రస్తుతం పేపర్ కూడా చదువుకుంటున్నాను!

 

 

బంగ్లా కమలమ్మ 

నర్వ గ్రామం 

మహబాబ్‌నగర్‌జిల్లా - తెలంగాణ రాష్ట్రం

+91 91772 03788

Go to top