" అసాధ్యాలను సుసాధ్యం చేసే ధ్యానం "

 

 

నా పేరు "దేవి". 2009 వ సంవత్సరంలో చిత్తూరు పిరమిడ్ మాస్టర్స్ బాలసుందరం మరి బాలసుబ్రమణ్యం గార్ల ద్వారా నాకు ధ్యానం పరిచయమయింది. నేను ధ్యానంలోకి రాకముందు అనారోగ్యం, డిప్రెషన్ కారణంగా నేను ఇంటర్మీడియట్‌లో ఒక సంవత్సరం వృధా చేసుకున్నాను. ఎంతో కష్టపడి రాత్రి సమయంలో 12.00 గం||ల వరకు కూడా చదివినా 50% మార్కులు మాత్రమే సాధించేదాన్ని.

 

ధ్యానం పరిచయమైన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది మంచి అనుకూల దృక్పధం అలవడింది చదువుతో పాటు విరామ సమయాల్లో ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ, ధ్యానానికీ, ధ్యాన ప్రచారానికీ ఎక్కువ సమయం వెచ్చించేదాన్ని. కొద్దికాలానికే ఆరోగ్యపరంగా చాలా కాలం నుండి నేను బాధపడుతున్న సైనస్ సమస్య తగ్గిపోయింది. "ధ్యానం ద్వారా గొప్ప ఆత్మస్థైర్యాన్ని సాధించవచ్చు" అనీ మరీ "ఆత్మస్థైర్యం వుంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు" అనీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

 

ఒకప్పుడు ఎంతో కష్టపడినా యాభై శాతం మార్కులు కూడా సాధించలేని నేను ఈ రోజు అవలీలగా B.Ed. లో గోల్డ్‌మెడల్ సాధించానంటే అది ఒక్క పిరమిడ్ ధ్యానంతోనే సాధ్యం అయ్యింది. అటువంటి పిరమిడ్ ధ్యానానికి జోహార్లు. ప్రస్తుతం మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ A.సంగీతబాబు సార్ మరి శ్రీనివాస గాంధీ సార్‌ల సూచనలు సలహాలతో ధ్యాన ప్రచారం బాగా చేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తూ అహర్నిశలు కృషిచేస్తూన్న మన జగద్గురువు పత్రీజీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు! అలాగే పిరమిడ్ ధ్యానులందరికీ నా ధ్యానాభినందనలు!

 

దేవి

బంగారుపాళ్యం

చిత్తూరు జిల్లా

Go to top