" ధ్యాన ప్రవృత్తితో మూర్ఛ నివృత్తి "

 

 

నా పేరు "బాలకృష్ణారెడ్డి". మహబూబ్‌నగర్ జిల్లా రాంపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూన్న నేను 2004 నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మూర్ఛవ్యాధి ఉండేది. ఎన్నిరకాల మందులు వాడినా .. వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. ఒక మిత్రుడి ద్వారా ధ్యానపరిచయం జరిగి .. ధ్యానం చేయడంతో నా మూర్ఛ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ నాకు ఈ పన్నేండేళ్ళలో ఎప్పుడూ మూర్ఛ రాలేదు.

 

DSC లో టీచర్ పోస్టుకు ఎంపిక కావాలని సంకల్ప ధ్యానం చేసి పరీక్ష వ్రాసిన నాకు పరీక్షలో 90 మార్కులు వస్తాయని తెలిసిపోయింది. ఫలితాలు కూడా సరిగ్గా 90 మార్కులు రావడం మరి అంతకు ముందే ఆ విషయాన్ని నా మిత్రులకు చెప్పి ఉండటంతో అందరూ ధ్యానం యొక్క విశిష్టతను చూసి ఆశ్చర్యపోయారు!

 

మాంసాహార కుటుంబంగా ఉన్న మా కుటుంబం పత్రీజీ యొక్క వాక్కులు విని శాకాహార కుటుంబంగా మారిపోయింది! నర్వ సీనియర్ పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయరెడ్డి గారు చేపట్టిన "గ్రామ గ్రామంలో ధ్యానం" కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం జరిగింది! 140 గ్రామాలలో నేను ధ్యానప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం .. నాలాంటి మూర్ఛవ్యాధిగ్రస్థులు ఎంతోమంది నాకు తారసపడటం, వారి అనుమానాలు నివృత్తికావడంతో వారు కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

 

ప్రచారంలో పాల్గొనడం ద్వారా ప్రజల నుండి రోగుల నుండి నేను కూడా ఎంతో నేర్చుకున్నాను. ధ్యాన ప్రచారంలో మాకు లభించిన ఆత్మీయ అనురాగాలను చూసి ఎంతో ఉత్సాహం వచ్చింది. ప్రచారంలో ఉన్న మమ్మల్ని ప్రత్యేకంగా "ధ్యానాంధ్రప్రదేశ్" ఆఫీసుకి పిలిపించుకుని పత్రీజీ చూపించిన వాత్సల్యానికి శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాను!

 

 

 


బాలకృష్ణారెడ్డి

కుమార్‌లింగంపల్లి గ్రామం

మహబూబ్‌నగర్ జిల్లా - తెలంగాణ రాష్ట్రం


+91 97016 18164.

Go to top