" పదకొండు బోర్లలో పుష్కలంగా నీరు! "

 

నా పేరు "ఆంజనేయరెడ్డి". రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసే దశలో .. మూత్రపిండాల మార్పిడి అవసరమైన దశలో .. మానసిక ప్రశాంతత లేక అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ దారి తప్పిన నా జీవితానికి ధ్యానం ఒక దిక్సూచిగా మారింది.

 

"హిమాంజి" .. "కుమన్న" అనే ఇద్దరు ఉపాధ్యాయుల ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని రోగాలు నయం చేసుకోవటం కొరకు మాత్రమే వచ్చిన నేను ధ్యానం ద్వారా సృష్టికి చెందిన అనేక నిగూఢ రహస్యాలు కూడా తెలుసుకుంటూ వచ్చాను. రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటూ .. మూత్రపిండాలు పనిచేయని స్థితిలో నేను ధ్యానసాధన ఎక్కువగా చేయడం మొదలయ్యింది. ధ్యానంలో నా కిడ్నీలను ఆస్ట్రల్ మాస్టర్స్ మళ్ళీ యధావిధిగా చేయడం జరిగింది. ఉదయం లేవగానే కాళ్ళనొప్పులతో బాధపడే నాకు ధ్యానంలో కాళ్ళ నొప్పులుపోయాయి. వేసవికాలంలో వచ్చే "మూత్రంలో విపరీతమైన మంట" వ్యాధికి ఇరవై ఏళ్ళుగా ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా తగ్గలేదు. అయితే కేవలం కొంతకాలం "ఆనాపానసతి" ధ్యానం చేయగానే వీటన్నింటి నుంచీ నేను విముక్తి పొందాను. రాబోయే గుండె నొప్పి కూడా ఒకసారి ధ్యానంలో విపరీతంగా వచ్చి తగ్గిపోయింది. "ధ్యానం సర్వరోగనివారిణి, సర్వ సమస్యల పరిష్కారిణి, సర్వభోగకారిణి" అని పదే పదే చెప్పే పత్రీజీ వాక్కులు నా నిజ జీవితంలో అక్షర సత్యాలు అయ్యాయి!

 

"నర్వ" గ్రామంలో పిరమిడ్ నిర్మాణానికి స్థలం దానం చేయడంతో నా జీవితంలో సరిక్రొత్త మజిలీ ప్రారంభమయ్యింది. నా కుటుంబ సమస్యలు ఒక్కొక్కటీ పరిష్కరించబడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఒక మామూలు రైతుగా నేను ధ్యానం చేయక ముందు బోర్లు వేసినా పడని నీరు పిరమిడ్‌కు స్థల దానం మరి పిరమిడ్ నిర్మాణం కొరకు విరాళాలు సేకరించడం వంటి విశేష కృషి ఫలితంగా నా పొలంలో ఎక్కడ బోరు వేసినా నీరు పుష్కలంగా రావడం మొదలయ్యింది!

 

అలా మొత్తం "పదకొండు బోర్లలో పుష్కలంగా నీరు రావడం ధ్యాన మహిమే" అని అందరూ చర్చించుకోవడం జరుగుతున్నది. పన్నెండేళ్ళ క్రితం ఎంత కష్టపడినా యాభై సంచుల ధాన్యం దిగుబడులు రాక ఇబ్బందులు పడ్డ నేను ఇప్పుడు సీజన్‌కు ఏకంగా ఆరువందల బస్తాలు పండించే స్థాయిలో ఉండటానికి ధ్యానమే అని సగర్వంగా చెప్పగలను!


ధ్యానం ద్వారా మాస్టర్లతో సందేశాలు తీసుకోవడం మరి నా శ్రీమతి "లావణ్య" .. "ఛానెలింగ్" ద్వారా డైబ్భైకి పైగా మాస్టర్ల సందేశాలు తీసుకోవడం జరిగింది. నర్వ "నీలకంఠ పిరమిడ్" లో తీసుకున్న సంకల్పాలు నా నిజ జీవితంలో వాస్తవరూపం దాలుస్తున్నాయి. "వంద గ్రామాలలో ధ్యాన ప్రచారం చెయ్యాలి" అని సంకల్పం తీసుకోగా "వందలు" అని మాస్టర్స్ అని చెప్పారు. ఈ సంవత్సరం కేవలం మూడు నెలల్లో ఇప్పటికి రెండువందల గ్రామాలు ధ్యానప్రచారం జరిగిపోయింది! నేను తీసుకునే ప్రతి నిర్ణయానికీ పత్రీజీ మరి ఇతర ఆస్ట్రల్ మాస్టర్ల సహాయసహకారాలు అందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

 

 

బంగ్లా ఆంజనేయరెడ్డి

నర్వ గ్రామం 

మహబూబ్‌నగర్ జిల్లా

తెలంగాణ రాష్ట్రం

+91 83747 76306

Go to top