" పిరమిడ్‌లో DNA ఉత్తేజితం " 

 

 

నా పేరు "ఆనంద ప్రసాద్". నాకు 2006లో ధ్యానం పరిచయం అయ్యింది. అంతకుముందు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలతో సాంగత్యం, పూజలు, భజనలు, దీక్షలతో ఈ జన్మను లోకకల్యాణం కోసం ఉపయోగించు కోవాలనుకుని నేను ఎన్నో మార్గాలను అన్వేషించాను. స్వామీ వివేకానంద చెప్పిన "మనం ఎవరికైనా విద్యనూ, వైద్యాన్నీ అందించాలి" అనే విషయాలు నన్ను ఆకర్షించాయి.

 

"విద్యను అందించినప్పుడు వివేకంతో వారి పనులు వారు చేసుకుంటారు. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యాన్ని అందించినప్పుడు ఎవరిపైనా ఆధారపడరు" అని ఆరోగ్యం కొరకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ మరి విద్య కొరకు ఒక మంచి విద్యాలయం స్థాపించాలని అనుకున్నాను.

 

అయితే 2007లో నేను పత్రీజీని కలిసిన తరువాత నా లక్ష్యానికి ఒక స్పష్టత ఏర్పడింది. "విద్య .. అంటే ‘ఆత్మవిద్య’ అన్నది .. ధ్యానం ద్వారా వస్తుంది; మరి ఆరోగ్యం అనేది కర్మలను తొలగించుకున్నప్పుడు పొందుతారు; అది కూడా ధ్యానం ద్వారానే వస్తుంది." అయితే "ఎన్నో ఆలోచనలతో మునిగిపోయిన ఈ జనావళికి సులభంగా ధ్యానం చేయడం కష్టం. దానికి ‘పిరమిడ్ శక్తి’ని తోడు చేయడం ద్వారా సులభంగా ధ్యానం చేసి ఆరోగ్యాన్నీ, జ్ఞానాన్నీ అందుకోగల్గుతారు" అని తెలుసుకున్నాను.

 

పిరమిడ్ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌లా పనిచేస్తుందని తెలుసుకుని పిరమిడ్స్‌ని ఎక్కువ మొత్తంలో ఈ భూమి మీద తీసుకు రావల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాను. పత్రీజీ మార్గదర్శకత్వంలో ఎన్నో ధ్యాన కార్యక్రమాలను ఏర్పాటు చేసి "ధ్యాన తెలంగాణ", "తెలంగాణ ధ్యానమహాచక్రం"లో ప్రచార బాధ్యతలు నిర్వహించాను. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో పిరమిడ్‌లు రావడానికి కృషిచేసాను.

 

నా స్వీయ అనుభవం: ఒక్కొక్క పిరమిడ్ ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. కొన్ని పిరమిడ్స్ హీలింగ్ కొరకు, కొన్ని క్రొత్త కణాల ఉత్పత్తి కొరకు, కొన్ని ఇతరలోకాలతో అనుసంధానం జరిగి ఈ భూమికి సమయ ద్వారాలుగా పని చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కొన్ని పిరమిడ్స్ DNA పునరుత్తేజితం కావడానికి ఉన్నాయి. పిరమిడ్ నిర్మాణాలు ఈ భూమికి ఎంతో శక్తినివ్వడమే కాక విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేయడానికి ఉపయోగపడతాయి.

 

నేను మరి కొంతమంది మాస్టర్లతో కలిసి పిరమిడ్స్‌లో ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో ఈ విషయాలు తెలుసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఒకానొక క్రొత్త కన్‌స్ట్రక్షన్ కంపెనీ ద్వారా పిరమిడ్ గృహాలు, పిరమిడ్ అపార్ట్‌మెంట్స్, రూఫ్‌టాప్ పిరమిడ్స్ నిర్మాణం విస్తృతంగా చేస్తున్నాను.

 

కాశిన ఆనందప్రసాద్

ఖమ్మంజిల్లా

+ 91 94414 19002

Go to top