" స్వాధ్యాయ ప్రచారంలో మా స్నేహబృందం "

 

నా పేరు "సాయి". నా ఫ్రెండ్స్ పేర్లు సాయి కుమార్, కృష్ణారెడ్డి. మేం ముగ్గురం 2011 సంవత్సరంలో పిరమిడ్ మెడిటేషన్(ఆనాపానసతి) నేర్చుకున్నాం.

 

నేను ధ్యానంలోకి వచ్చి, శాకాహారిగా మారిన మూడు నెలల్లోనే పొట్టకు సంబంధించిన అనారోగ్యం నుంచి విముక్తి చెందాను. అలాగే నా ఫ్రెండ్స్ కూడా ధ్యానం వలన మంచి ఫలితాలను పొందడంతో అయితే ధ్యానం అందరికీ అందటం కోసం ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాం.

 

అందుకోసం "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్‌ను ధ్యానప్రచారానికి ఒక మార్గంగా ఎంచుకుని 2013లో మా ప్యాకెట్ మనీతో నెలకు కొన్ని "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్‌లను హైదరబాద్ నుంచి తెప్పించుకుని విశాఖపట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకూ మరి కొన్ని ప్రైవేటు కాలేజీలకూ ఒక సంవత్సరం పాటు పంపించాం.

 

"ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్‌ను గ్రంథాలయాల లోని చాలామంది పాఠకులు ఇష్టపడటంతో మరిన్ని గ్రంథాలయాలు కూడా స్వంతంగా "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్స్‌ను తెప్పించుకోవడం మొదలుపెట్టాయి. దాంతో మేము మిగతా జిల్లాల్లోని గ్రంథాలయాలకు కూడా "ధ్యానాంధ్రప్రదేశ్" ను పంపించాలనుకుని ఐదు జిల్లాలకు 59 "ధ్యానాంధ్రప్రదేశ్"మ్యాగజైన్‌లను ఒక సంవత్సరం పాటు పంపించాం. ఇప్పటి వరకు మొత్తం 79 గ్రంథాలయాలకు మేము మ్యాగజైన్స్‌ని పంపించడం జరిగింది.

 

"ధ్యానాంధ్రప్రదేశ్" పంపించిన జిల్లాల గ్రంథాలయాలు: శ్రీకాకుళం-22; విజయనగరం-15; విశాఖపట్టణం-13; తూర్పుగోదావరి-8; గుంటూరు-7; కృష్ణా జిల్లా -7; దీనికోసం ఇప్పటివరకు మేము సుమారు 20,000 రూపాయలు ఖర్చు పెట్టాం.

 

ఇంకా ఎవరైనా ఈ విధంగా "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్ ను గ్రంథాలయాలకు పంపించడం ద్వారా ధ్యానప్రచారానికి సహాయం చేయాలనుకుంటే ఈ క్రింది నంబర్స్‌కు ఫోన్ చేయగలరు.

 

+91 81216 09725, +91 75693 91984

Go to top