" ఏది సంకల్పిస్తే అది నెరవేరుతోంది "

 

 

నా పేరు "నగేష్". కొత్తగూడెంలో బంగారు నగల వ్యాపారం చేస్తూ వ్యాపారంలో ఒడిదుడుకులకు నేను లోనై .. వాటిని అధిగమించే మార్గం కోసం వెతుకుతూ వుండగా మా తమ్ముడు "సుధాకర్" ఆనాపానసతి ధ్యానం గురించి చెప్పాడు.

 

నా సాధన మొదలైన మూడునెలలకు పత్రీజీ కొత్తగూడెం వచ్చినప్పుడు ఆయన నన్ను తాకగానే నా శరీరం మొత్తం కంపించిపోయింది అప్పుడు ఆయన "భయం దేనికి?" అంటూ నా చెంపపై తట్టారు. ఆ క్షణంలో నా శరీరంలో ఒక మెరుపు మెరిసి, శరీరం నిశ్చలమై తేలికైంది!

 

ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఏది సంకల్పిస్తే అది జరుగుతూ, నేను ఎవరికి ధ్యానం చెప్పినా వారు వెంటనే సాధన చేస్తున్నారు! అప్పటినుంచి నేను, సుధాకర్, శివరామకృష్ణ, వెంకటేశ్వరరావు, మురళి, శరత్, చిన్నారావు, జనార్థన్, ప్రసాద్ గార్లతో కలిసి ఒక బృందంగా ఏర్పడి "సూపర్ స్పెషాలిటీ హీలింగ్ మెడిటేషన్ సెంటర్"ను ప్రారంభించారు. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10.00 గం||ల నుంచి 1.00 గం||వరకు "సంకల్ప ధ్యానం" నిర్వహిస్తూ, భోజన సదుపాయం కలుగజేశాము. దానిలో ఇప్పటికే కొన్ని వందలమంది తమ సమస్యల నుండి విముక్తులై, ఆనందంతో నిరంతరం ధ్యానం, ధ్యానప్రచారాలలో పాల్గొంటున్నారు.

 

వారిలో ముఖ్యంగా ఒక మేడమ్ బ్రెస్ట్ కాన్సర్‌తో బాధపడుతూ మొదటిసారి కిమోథెరఫిలో చాలా ఇబ్బందికి లోనయ్యి, ఆ తరువాత సంకల్ప ధ్యానానికి వచ్చి ప్రతిరోజూ మూడు నుంచి ఆరు గంటల వరకూ ధ్యానం చేసేవారు. ఇరవై రోజుల తరువాత రెండవసారి కిమోథెరపీకి వెళ్ళేసరికి నొప్పి నుంచి విముక్తి పొందారు! ఆ మార్పుకు డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారు.

 

అది చూసి డాక్టర్లు కూడా నా వద్ద ధ్యానం నేర్చుకుని సాధన చేస్తున్నారు! నా వ్యాపారం కూడా మెరుగైంది! ఈ కార్యక్రమాన్ని శ్రీ G.సుధాకర్, శ్రీ V.శివరామ కృష్ణలు ఎంతో ఉత్సాహంతో, శ్రద్ధతో, సహనంతో నిర్వహిస్తున్నారు. ఈ బృందం అంతా తమ దైనందిన వ్యవహారాలతో పాటు ప్రతి రోజూ రెండు గంటలు ధ్యాన ప్రచారానికి తప్పనిసరిగా కేటాయిస్తుంది. ఈ బృందం సంకల్పంతో దారాస్ హైట్స్ (శ్రీ చైతన్య టెక్నో స్కూల్) ఉన్న భవనంపై "హీలింగ్ పిరమిడ్"ను లిఫ్ట్ సౌకర్యంతో సహా నిర్మించబోతున్నాము.

 

కొత్తగూడెంతో పాటు తెలుగు రాష్ట్రాల వారు అందరూ ఆరోగ్యానందాలతో జీవించటం కోసం నా చివరి శ్వాస ఉన్నంత వరకు ధ్యానం, పిరమిడ్ శక్తులను గురించి ప్రచారం చేస్తాను. నాకు ఈ అర్హతనూ, అవకాశాన్నీ ప్రసాదించిన పత్రీ సార్‌కు ప్రణామాలతో ..

 

దారా నగేష్

కొత్తగూడెం

ఖమ్మంజిల్లా
+ 91 98665 25942.

 

Go to top