" అంతమంది ఊరికే రారు కదా! "

 

 

నా పేరు "ప్రవీణ్‌కుమార్". నేను బాలమణి, పెంటయ్య దంపతులకు "బూర్గుల" గ్రామంలో జన్మించాను. నేను డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నప్పుడు, 2009లో మహబూబ్‌నగర్ జిల్లాలో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. విధి నిర్వహణలో భాగంగా 2012 సంవత్సరంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు కడ్తాల్‌లో జరిగిన ప్రపంచ ధ్యానమహాసభలకు హాజరయ్యాను. ఆ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అసంఖ్యాకంగా తరలివచ్చిన ధ్యానులనూ మరి గొప్ప గొప్ప వారిని చూసి నాకు ఒకింత ఆశ్చర్యం, మరొకింత ఆసక్తి ఏర్పడింది!

 

"చూడటానికి అందరూ విద్యావంతులు లానే కనిపిస్తున్నారు. ఏ కారణం లేకుండా అంతమంది ఊరికే రారు కదా! ఏమిటో విషయం?" .. అని పిరమిడ్ గురించి, ధ్యానం చేసే పద్ధతి గురించి తెలుసుకున్నాను. పత్రీజీ ప్రవచనాలను వింటూ అక్కడికి విచ్చేసిన ధ్యానులతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకోవడం చేసేవాడిని.

 

ఆక్రమంలోనే పిరమిడ్ త్రిరత్నాలు "ధ్యానం", "స్వాధ్యాయం", "సజ్జన సాంగత్యం"లను ఆచరించడం ప్రారంభించాను." రెండు హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే (H2O) నీరు ఏర్పడడం "శాస్త్రీయంగా ఎంత నిజమో .. "శ్వాస మీద ధ్యాస .. ఆనాపానసతి ధ్యానం చేయడం వల్ల ఆలోచన రహితస్థితి కలిగి .. విశ్వశక్తి ఆవాహనం .. నాడీమండల శుద్ధి వంటి చర్యలు జరగడం .. అప్పుడు అనేక రకాలైన ఆత్మానుభవాలు కలుగడం కూడా అంతే నిజం" అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

 

గురువుగారు కూడా "శారీరక రుగ్మతలన్నింటికీ ఆత్మజ్ఞానం లేకపోవడం, ధ్యానం చేయలేకపోవడం కారణాలు" అని చెప్పారు కనుక `Internal change' ద్వారానే ‘External Change' సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకోవడమే తరువాయి అప్పటి నుంచి మా తల్లిదండ్రులకూ, తమ్ముడికీ మరి మా కొలీగ్స్‌కూ మరి పరిచయం ఉన్నవారికి ధ్యానం గురించి చెప్పడం ప్రారంభించాను. అయితే ఈ రకంగా కొద్దిమందికి మాత్రమే చెప్పగలను కనుక ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశ్యంతో పత్రీజీ ఆధ్వర్యంలో వెయ్యిమందితో ఉచిత ధ్యానశిక్షణ కార్యక్రమాన్ని షాద్‌నగర్‌లో నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది.

 

ఆ వార్తను షాద్‌నగర్ పరిసరప్రాంత ప్రజలకు తెలియజేసి సుమారు 1000 మందితో జూలై 29వ తేదీన పత్రీజీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నాము .. ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో మా కుటుంబ సభ్యులు మరి మిత్రుల ప్రోత్సాహం ఎనలేనిది! ఈ అవకాశాన్ని ఇచ్చిన జగద్గురువు పత్రీజీకి సవినయ నమస్కారాలు!

 

 

N.ప్రవీణ్ కుమార్

బూర్గుల గ్రామం

మహబూబ్‌నగర్ జిల్లా
సెల్: 94414 36327.

Go to top