"డా||నీతాదాస్"

లండన్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం మరి గణిత శాస్త్రాలలో డాక్టరేట్ విద్యను అభ్యసించి .. ఆపరేషన్ & రీసెర్చ్‌ను వృత్తిగా ఎంచుకున్న డా|| నీతాదాస్ .. భారతదేశం, బ్రిటన్, బెల్జియమ్‌లలో ఉపన్యాసకురాలిగా అనేక సదస్సులను నిర్వహించారు. "యోగా", "ఒత్తిడి నివారణ", Kinesiology శాస్త్రాలను విశేషంగా అధ్యయనం చేసినా నీతా .. తమదైన శైలిలో నూతన ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించి అందులో డాక్టరేట్ పట్టాను పొందారు. అనాటమీ మరి శరీర ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసిన నీతా .. ఆధునిక ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను ‘యోగా’తో మేళవించి మరీ బోధిస్తూంటారు. వారి నుంచి కొంత సమాచారం వారి మాటల్లోనే విందాం!

"మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా మొదలైంది?"
"మా అమ్మమ్మ బాగా పూజలు చేసేవారు. నా చిన్నతనంలో నేను కొంతకాలం పాటు భారతదేశంలో ఆవిడ దగ్గరే పెరగడంతో ఆవిడ పూజలు చేసే విధానాన్ని నేను కూడా అనుసరించేదానిని అంతకు మించి వేరే ఆధ్యాత్మిక నేపధ్యం నా జీవితంలో ఏదీలేదు. "మా అమ్మకు .. అమ్మమ్మలాగా పూజలు చేసే అలవాటు లేకపోవడంతో ఆ తరువాత కాలంలో ఆమెతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్ళిపోయాక నా పూజలు మూలపడ్డాయి.

"ఇంగ్లాండ్‌లోనే నా చదువూ, వృత్తి, ఉద్యోగం, వివాహం, ఇద్దరు పిల్లలూ మరి వాళ్ళ వివాహాలు అన్నీ జరిగిపోయాయి. ఆ తరువాత కొన్ని ఇబ్బందుల రీత్యా నేను 1989-93 ప్రాంతంలో ముంబయికి వచ్చి యోగసాధన చేయడం మొదలుపెట్టాను.

"ఆ క్రమంలోనే రామకృష్ణ మఠానికి చెందిన కొందరు సాధువులు నాకు మిత్రులు కావడంతో వారి నుంచి నేను ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే దానిని." "ఆ తరువాత కొంతకాలం పాటు మళ్ళీ లండన్‌కు వెళ్ళి గణితశాస్త్ర బోధకురాలిగా పనిచేసినా .. నా వైవాహిక బంధం పట్ల నాకు ఏర్పడిన కొన్ని భయాల కారణంగా నేను మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చేసి కేదార్‌నాథ్, బదరీనాథ్‌లనూ మరి దక్షిణ భారతదేశంలోని ఆలయాలనూ .. పూరీ జగన్నాధ్, ద్వారక, సోమనాథ్ ఆలయాలనూ దర్శిస్తూ వెళ్ళాను.

ఈ క్రమంలో రెండు సార్లు అలహాబాద్ కుంభమేళాకూ 11సార్లు విపస్సన ధ్యానశిబిరాలకూ వెళ్ళాను. ఈ యాత్రల వల్ల కలిగిన అనుభవాలతో నాలో మొలకెత్తిన ఆధ్యాత్మిక బీజాలు .. చిగురించి సేవాదృక్పథం పట్ల నాకు స్పష్టమైన అవగాహనను కలుగజేశాయి.

"భూమి మీద మనుష్యులందరూ అనేకానేక శారీరక అనారోగ్యాలకు గురికావడం చూశాక వారిని శాస్త్రీయంగా మరి తేలికగా ఆ బాధల నుంచి స్వస్థత పరచాలని నాకు అనిపించింది. "దాంతో రైకీ, యోగా, కైనీసియాలజీ, QXCI -Scale Scannerలను అధ్యయనం చేశాను. ఇవి అన్నీ కూడా ‘ఎనర్జీ మెడిసిన్’లో అత్యున్నత స్థాయి విభాగాలకు చెందిన స్వస్థతా ప్రక్రియలు. వీటన్నింటితో కలిపి ఒత్తిడి నివారణ పద్ధతులు, skill-set techniques మరి product techologies లను నేను రూపొందించుకోవడం జరిగింది."
"ఎనర్జీ మెడిసిన్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి?"
"మన శరీరంలోనే సహజమైన వైద్యుడు నిక్షిప్తమై ఉన్నాడు కనుక ఆ వైద్యుడి సహాయంతో మన శరీరం తనను తాను స్వతః సిద్ధంగానే బాగు చేసుకోగలిగిన సామర్ధ్యాన్ని కలిగివుంటుంది. "నేను Cosmodic, Scio, Quantum Life, Lasers, Kinesiology - muscle techniqueలను ఉపయోగించి శరీరంలోని శక్తి ప్రవాహాలను బ్యాలెన్స్ చేసి దానిలోని సహజ స్వస్థతాశక్తిని మేల్కొలుపుతాను. మిగతా అంతా శరీరమే చూసుకుంటుంది."
"ఈ స్వస్థతా చికిత్సలు అన్నీ మీ దగ్గరికే వచ్చి చేయించుకోవాలా?"
"అవసరం లేదు! ఎనర్జీ స్కానర్‌తో ఎనర్జీ లెవెల్స్‌ను ఫోటో తీసి వేరే ప్రాంతంలో ఉన్నా సరే చికిత్స చేయవచ్చు. ‘ఇంత అద్బుతమైన ఎనర్జీ చికిత్సా విధానాన్ని అందరూ అనుసరించి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి’ అని నేను కోరుకుంటున్నాను."

Go to top