"ధ్యానప్రచారానికి అరుదైన గౌరవం"

 

విశాఖపట్టణం .. బర్మాక్యాంప్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ "దాడి జ్యోతి భవాని"గారు .. నిరంతర ధ్యానప్రచార సేవలో నిమగ్నమై ఉంటూ అనారోగ్యం, అశాంతి, ఆర్థిక డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడేవాళ్ళకు చక్కటి కౌన్సిలింగ్‌లు చేస్తున్నారు.

విశ్వ ప్రేమకు ఈ ఆత్మజ్ఞాని అందిస్తోన్న అమూల్యమైన సేవలను గుర్తించిన ప్రముఖ సేవాసంస్థ "India International Friendship Society"వారు జ్యోతి భవాని గారికి "భారత గౌరవ" అవార్డును అందజేయడం జరిగింది! తమిళనాడు&అస్సామ్ గవర్నర్, గౌరవనీయులు "డా||భీష్మ నారాయణ్ సింగ్" గారి చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందుకున్న జ్యోతి భవాని గారు "ఒకప్పుడు సామాన్య గృహిణిగా జీవిస్తున్న నేను .. ధ్యానశక్తితో నా లోని గొప్పదనాన్ని నేను వెలికి తెచ్చుకుని .. సేవ చేయడంలోని మౌలిక సత్యాన్ని తెలుసుకున్నాను. అప్పటి నుంచి ధ్యానప్రచార సేవ ద్వారా నన్ను నేను ఉన్నతీకరించు కుంటున్నాను. "ఇంత గొప్ప మైత్రేయతత్వాన్ని నాకు అందించిన పత్రీజీకి మరి నా తల్లితండ్రులకూ కృతజ్ఞతలు" అని తెలియజేశారు.

దాడి జ్యోతి భవాని

+ 91 92484 05682.

Go to top