"జయశ్రీ మన్నీ"

 

దక్షిణాఫ్రికా దేశానికి చెందిన "జయశ్రీ మన్నీ" పూర్వీకులు భారతదేశానికి చెందిన వారు కావడంతో ఆవిడ మూలాలన్నీ ఇక్కడి ప్రాచీన సంస్కృతితోనే ముడిపడి ఉన్నాయి. లైఫ్ కోచ్‌గా, ఆధ్యాత్మిక బోధకురాలిగా, కమ్యూనిటీ లీడర్‌గా, వక్తగా, రచయిత్రిగా జయశ్రీ ఆధ్యాత్మిక జగత్తుకు చిర పరిచితులు! గత 25 సంవత్సరాలుగా వీరు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ తమ శక్తిప్రకంపనా శృతితో వేలాదిమంది పిన్నలకూ, పెద్దలకూ స్వస్థతను కలుగజేసి వారు హాయిగా జీవించేట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని నవీన సాంకేతికతతో మేళవిస్తూ అనేక రకాల క్షేత్రస్థాయి ప్రయోగాలను చేపడుతూన్న జయశ్రీ .. ‘ఆధ్యాత్మిక విజ్ఞానం’ అన్నది మార్మికత యొక్క ప్రాచీన భాష అయితే .. నవీన సాంకేతికత అన్నది చైతన్యం యొక్క అనంత తలం! అందుకే ఈ రెండింటి మేళవింపుతో మనం అద్భుతాలను సృష్టించవచ్చు అంటారు! "భవిష్యత్తు .. ఇప్పుడే" అంటూ నవీన ఆధ్యాత్మిక శాస్త్ర సాంకేతికతను గురించిన పలు విషయాలను వారు "ధ్యాన జగత్"తో ముచ్చటించారు ..

"మీ గురించి తెలియజెయ్యండి మేడమ్!"
"భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మా తాతగారు చాలా యేళ్ళ క్రితమే దక్షిణాఫ్రికాకు పనికోసం తీసుకువెళ్ళబడ్డారు. గణితంలో దిట్టఅయిన వారు అకౌంటెంట్‌గా అక్కడ తమ జీవితాన్ని ప్రారంభించారు.

"కొంత కాలానికి స్వంత వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా వ్యాపారంలో గణనీయమైన విజయాలను సాధిస్తూ .. అనేకానేక వ్యాపారాల ద్వారా అంతులేని సంపదను ఆర్జించారు! సంపదతో పాటే ప్రఖ్యాతులు మరి వాటితో పాటు ప్రభుత్వ అధికారులతో మంచి స్నేహసంబంధాలను సంపాదించడంతో వారు భారతదేశంతో దక్షిణాఫ్రికా స్నేహసంబంధాలు బలపడడానికి ఎంతో కృషి చేశారు! "ఇలా సంపదతో పాటు గొప్ప ఆధ్యాత్మికత కూడా మా కుటుంబ నేపధ్యంగా ఉంటూ పూజలూ, వ్రతాలు వంటి సాంప్రదాయాలు మా ఇంట్లో సజీవంగా సాగేవి.

1939 సంవత్సరంలో మా తాతగారు ఒక పెద్ద గుడి కట్టించి భారతదేశం నుంచి అన్ని దేవతల విగ్రహాలనూ తెప్పించి . సామూహిక ఆరాధనలూ, పూజలూ చేయించేవారు. ఇలా ఆధ్యాత్మికత అన్నది మాకు సంపదతో పాటే వారసత్వంగా అబ్బిన గొప్ప విషయం."

"మీకు సేవా కార్యక్రమాలలో అభిరుచి ఎలా ఏర్పడింది?"
"నేను భిన్న భిన్న సబ్జెక్ట్‌లలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాను. సైకాలజీ, MBA చదివి వ్యక్తిత్వ వికాస శిక్షణను పొందాను. ఒక చిన్న పల్లెలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ అక్కడికి వచ్చే పిల్లలకూ మరి దారిద్ర్యరేఖకు దిగువన ఉండి పోషకాహార లోపంతో బాధపడేవారికీ మరి మానసిక ఎదుగుదల సరిగ్గా లేని వారికీ పోషకాహారాన్ని అందిస్తూ ఒక కౌన్సిలర్‌గా వారికి మానసిక తోడ్పాటునందిస్తూ వచ్చాను.

"ఇంతలో మా నాన్నగారు అకస్మాత్‌గా చనిపోవడంతో నేను దిగ్భ్రాంతి చెంది .. దేవుడిపై కోపంతో నిజమైన ఆధ్యాత్మిక అన్వేషణలో పడ్డాను. "ధ్యానం ద్వారా మరణానంతర జీవితపు సమాచారాన్ని మరి ఆత్మ పరిణామక్రమం యొక్క సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని ఆ విజ్ఞానంతో నన్ను నేను స్వాంతన పరచుకుంటూ ఇతరులకు కూడా తోడ్పడడం మొదలుపెట్టాను.

"మొదటగా విద్యార్థులకు `Emotional Health ఉద్వేగిక ఆరోగ్యం’ కల్పించి .. వారు చెప్పాలి అనుకున్న దానిని నిస్సంకోచంగా, నిర్భయంగా చెప్పేటట్లు చేశాను. "అదే ఇప్పుడు దక్షిణాఫ్రికా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పాఠశాలలో నిర్వహింపబడుతూన్న ‘గోల్డెన్ హార్ట్ ప్రోగ్రామ్’కు పునాది.

"ఆ పైన నేను నా ఉద్యోగాన్ని వదిలి ప్రపంచం అంతా బోధించడం ఆరంభించాను. అలా పర్యటిస్తూ నేను ఒకేసారి అన్ని ప్రదేశాలలో సేవచేయడం కోసం నేను ‘ఆధ్యాత్మిక సాంకేతికత - Spiritual Technology'కు చెందిన కొన్ని ఉపకరణాలు gadgets తయారు చేశాను. వాటి ద్వారా మనుష్యులు తమ ఆరోగ్యానికి తామే బాధ్యతవహించే సామర్థ్యాన్ని పొందుతూ ‘మనం అంతా కూడా ప్రకంపనా జీవులం’ అని తెలుసుకుంటారు.

"మన శరీరం, మనస్సు తమవైన పౌనఃపున్యాల కలిగి ఉంటాయి. ఈ ఉపకరణాల ద్వారా అత్యధిక స్థాయిలో ఆరోగ్యకరమైన పౌనఃపున్యాన్ని చేర్చడంతో మనిషి శరీరం, మనస్సు యొక్క పౌనఃపున్యాలు కూడా అత్యధిక స్థాయికి పునర్నిర్దేశించబడతాయి. "సాధారణ వ్యక్తుల శరీర ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ వారిలో రోగనిరోధక శక్తి పెంపొందడానికి ఉపకరించే ఈ ఉపకరణాలు వైద్యరంగంలో కూడా ఎంతో సహాయకారులుగా ఉంటున్నాయి."
"ఆధ్యాత్మిక సాంకేతికతను సంబంధించిన ఈ ఉపకరణాలలో ఎటువంటి శాస్త్రీయత ఇమిడి ఉంది?"
"నా చికిత్సా విధానం అంతా కూడా Bio-Photon .. Stroke Light Therapy .. Low Level Lazer Therapy .. Cranial Eleectro Stimulation .. Bio-Feedback .. Electro Magnetic Pulse .. Micro Current .. Prime Ordial Sound .. అన్న వివిధ చికిత్సా పద్ధతులతో కూడి ఉంటుంది. "మానవ చైతన్యంలో గాఢమైన మార్పు కలిగిన ప్రతిసారీ సాంకేతికత కూడా ఆ గాఢమైన మార్పుకు అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది కనుక భవిష్యత్తు యొక్క స్వస్థతా ప్రక్రియలు ఇవే!"
"మీరు అభివృద్ధి చేసిన కొన్ని ఉపకరణాల పేర్లు చెప్పండి!"
"Energy Band: నొప్పిని నివారిస్తుంది; నీటిని సజీవం చేస్తుంది; నాడులు మరి మెరీడియన్ సిస్టమ్‌ల నుంచి నిరోధాలను తొలగిస్తుంది.
Frequency Resonator: మనం ఉండే గదిలో మరి ఇంట్లో ఉపయుక్తమైన పౌనఃపున్యాలను వెలువరిస్తుంది. మనం చైతన్యంలో సృష్టితో ఏకత్వపుభావనను పెంపొందిస్తుంది.
BTP Life': జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపుదల, లక్ష్యసిద్ధి, అంతరంగశాంతి, విశ్రాంతితో కూడిన నిద్ర, కుండలినీ సమతుల్యత పెంచడంతో పాటు చెడువ్యసనాల నుంచి దూరం చేస్తుంది.
Omega 8 full system: శరీరంలోని శక్తి అసమతుల్యతలను గుర్తించి, స్వస్థత కోసం తీసుకోవలసిన చర్యలను సూచిస్తుంది.’

మరిన్ని వివరాలకు:
info@kreativity at work.co.za

Go to top