"నీమా జానెట్ టేలర్"

 

"నీమా జానెట్ టేలర్" .. వియత్నాం జెన్ సంప్రదాయలలోనూ మరి క్రిస్టియన్ మత విధానాలలోనూ శిక్షణ పొందిన అమెరికన్ బౌద్ధ సన్యాసిని. బుద్ధిజాన్ని విశేషంగా అధ్యయనం చేసిన నీమా .. "Buddhism for Non-Buddhists", "Meditation for Non-Meditators" అనే రెండు పుస్తకాలను వ్రాశారు. వ్యక్తిగత జీవితంలోనూ మరి సమాజంలోనూ సానుకూల మార్పులు రావాలంటే ప్రపంచంలోని వివిధ మత సాంప్రదాయాలన్నీ కూడా ఒక సాధారణ విధివిధానాన్ని అనుసరించాలంటూ .. ఆ దిశగా పరిశోధనలు చేపట్టే నీమాగారి గురించిన కొన్ని విశేషాలు ..

"భారతదేశంతో మీకు అనుబంధం ఎలా ఏర్పడింది?"
"చదువుకునే రోజులలోనే నేను భారతదేశానికి వచ్చి పూనే విశ్వవిద్యాలయంలో బౌద్ధసాహిత్యం గురించి అధ్యయనం చేశాను. ఆ తరువాత USA లో MBA పూర్తి చేసి 20 సంవత్సరాలపాటు కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ చేతినిండా డబ్బు సంపాదించాను. అయినా మనశ్శాంతి కరువు కావడంతో సత్యాన్వేషణ దిశగా నా ప్రయాణం మొదలుపెట్టాను.

"దాంతో మళ్ళి భారతదేశానికి వచ్చి బుద్ధగయ మరి బ్రహ్మవిహారాలను సందర్శించాను. " ‘మహేంద్ర’ నా మొట్టమొదటి ధ్యానబోధకులు! వారితో కలిసి విపశ్యన ధ్యానం చేస్తూ .. బుద్ధుని జీవిత చరిత్రనూ మరి బుద్ధుని బోధనలనూ విశేషంగా అధ్యయనం చేశాను. ‘ప్రేమ, కరుణ, దయ వంటి దివ్యలక్షణాలతో కూడి ఉన్నప్పుడే మనం ఆనందంగా జీవించగలం’ అని తెలుసుకున్నాను. ఆ తరువాత నా సహబోధకులు ‘లామా సూర్యదాస’తో కలిసి అమెరికా దేశానికి వెళ్ళిపోయాను.

"అక్కడ ‘Temple of Buddhist Centre'కు డైరెక్టర్‌గా మరి ముఖ్య బోధకురాలిగా ఉంటూ బుద్ధుని బోధనలను అమెరికా దేశ సంస్కృతికి అనుగుణంగా మేళవించి .. ‘అమెరికన్ బుద్ధిజమ్’గా దానిని ప్రబోధిస్తూ వచ్చాను. ప్రస్తుతం మా సంస్థలో సుమారు 5,000 మంది బుద్ధప్రచారకులు ఉన్నారు."

"పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అంతా చూశారా? GCSS ఎలా వుంది?"
"పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ .. ప్రపంచస్థాయి కలిగిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ! ఇక్కడికి వచ్చి ప్రేమాస్పదులైన పిరమిడ్ మాస్టర్లనూ .. మరి బ్రహ్మర్షి పత్రీజీ, జాస్ముహీన్ వంటి గురువులనూ .. కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను."

Go to top