"రాబర్ట్ శ్వార్ట్‌జ్"

 

"రాబర్ట్ శ్వార్ట్‌జ్" .. హిప్నాటిస్ట్, "పాస్ట్‌లైఫ్ సోల్ రిగ్రేషన్స్"తో పాటు ‘బిట్వీన్ లైఫ్ సోల్ రిగ్రెషన్స్’ (రెండు జన్మల మధ్య ఆత్మ స్థితి/ప్రయాణం) నిర్వహిస్తారు. దానిలో మనం Council of Eldersతోనూ, భూమిపై జన్మల విషయాలను చూసే వివేక, ప్రేమమూర్తులతోనూ మాట్లాడి ఈ భూమిపైకి వచ్చేటప్పుడు మన ప్రణాళిక ఏమిటో ఎందుకో తెలుసుకోవచ్చు. "Your Soul`s Plan", "Your Soul`s Gift" అనే రెండు ఉద్గ్రంధాల రచయిత. ఆయన గురించీ, ఆయన గ్రంథాల గురించీ కొంత సమాచారం ..
మూలం: www.yoursoulsplan.com

"2003 సంవత్సరం మే 7 వ తేదీ నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు! "Your Soul`s Plan .. Discovering The Real Meaning of The Life .. You Planned Before You Born .. అన్న పుస్తకం వ్రాయడానికి దారి తీసిన రోజు అది!

"అప్పటికి నేను నలభై సంవత్సరాలపాటు మార్కెటింగ్ మరి కమ్యూనికేషన్ రంగంలో కన్సల్టెంట్‌గా సంతృప్తికరమైనంత ధనాన్ని సంపాదిస్తున్నా కూడా ఎందుకో అసంతృప్తితో రగిలిపోతూ ఉండేవాడిని. ‘నా జీవితానికి ఇంతకంటే ఏదో గొప్ప లక్ష్యం ఉండే ఉంటుంది’ అన్న బాధ నన్ను సదా వెంటాడుతూ ఉండేది.

దాంతో నేను నా మనస్సులో ఉన్న ఆరాటానికి కారణం తెలుసుకోవడానికి ఒక సైకిక్ మీడియమ్ ద్వారా ‘స్పిరిట్ గైడ్స్’ తో మాట్లాడడం మొదలుపెట్టాను. వారే నాకు .. నేను ఈ భూమి మీదకు రావడానికి వేసుకున్న ప్రణాళికను గురించి వివరించారు.

"వారి గైడెన్స్‌లో నేను స్వయంగా అనేకానేక ఆదిభౌతిక అనుభవాలను పొందుతూ .. ఒకరోజు నా వ్యాపారాలన్నింటి నుంచీ సెలవు తీసుకుని ఖాళీగా గడపడానికి సముద్రతీరం వెంట నడుచుకుంటూ వెళ్ళసాగాను.

అలా ఏ ఒత్తిడీ, ఆలోచనా లేని ఒక నిశ్చల నిర్వికార స్థితిలో నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తూన్న నాలో .. నా కళ్ళకు కనబడుతోన్న వాళ్ళందరిపైన బేషరతు ప్రేమ ఉప్పొంగ సాగింది. అది నాకు స్పష్టంగా తెలిసిపోతోంది!

"ఈ విధమైన విషయాలను గురించి ఇదివరెకెన్నడూ నేను విని/చదివి ఉండకపోయినా .. ఇది నేను నా ఆత్మతో ఐక్యత చెందడం ద్వారా సంభవిస్తోంది అని నా అంతరావబోధ నాకు తెలియజేసింది. నా ఆత్మ నాతో .. ‘ఈ ప్రేమయే వాస్తవమైన నువ్వు .. ఇదే నీ సత్య ప్రకృతి’ అని చెప్పింది.

"ఆ తరువాత నేను నలుగురు అత్యున్నత మీడియమ్స్ మరి ఛానెలర్స్‌తో కలిసి మనుష్యులు జన్మ తీసుకోవడానికి ముందు వేసుకున్న ప్రణాళికలను గురించి పరిశోధించాను. భౌతిక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలను కలిగి ఉండటం, అనారోగ్యాలూ మరి మాదకద్రవ్యాలకు బానిసలు కావడం, ప్రమాదాలలో ప్రియమైన వారిని కోల్పోవడం వంటి సవాళ్ళతో జన్మలు తీసుకోవడానికి కొందరు ఎందుకు ప్రణాళికలు వేసుకుంటారో అన్వేషించి నాలుగు కారణాలను కనుగొన్నాను.

* సవాళ్ళు అన్నవి మన జన్మ కర్మలను సమం చేయడానికి మనకు ఇతోధికంగా సహాయం చేస్తాయి.
* ఒక్కోసారి ఇతరులకు సహాయం చేయడం కోసం కూడా మనం సవాళ్ళను సిద్ధం చేసుకుంటాం
* జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు .. మనల్ని మనం బేషరతు ప్రేమాస్పదులలా గుర్తించుకునేట్లు చేస్తాయి. మనం ప్రేమ శక్తితో మలచబడిన భౌతిక స్వరూపాలం అనీ .. మన ప్రకృతి ప్రేమ మాత్రమే అనీ మనకు తెలియజేస్తాయి.

"వైరుధ్యాలు మరి ద్వంద్వాలతో నిండిన ఈ భూమిలో తరచుగా ప్రేమరాహిత్యాన్ని ఎదుర్కొనే మనం .. ఆ విధమైన అనుభవాల ద్వారానే బేషరతుగా ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటూ .. మనం ఎవరో గుర్తుకు తెచ్చుకుంటాం!!"

Go to top