" ధ్యానం ద్వారానే ఏకాగ్రత, ప్రతిభల పెంపుదల "

 

 

నా పేరు "పద్మజ".


నేను గత 14 సంవత్సరాలుగా కడప జిల్లాలో ప్రభుత్వ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. 2010 సంవత్సరంలో నేను "ప్రొఫెసర్ ఊర్మిళాదేవి" గారి ద్వారా ధ్యానం నేర్చుకుని నాకు ఉన్నసకల అనారోగ్య సమస్యల నుంచి బయట పడ్డాను.

 

శుద్ధ శాకాహారిగా మారి ఆరునెలల కాలంలో సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారాను. విద్యార్థులతో రోజూ ధ్యానం చేయించడం వలన వారిలో కుదురు పెరిగి, చదువుపై ఏకాగ్రత పెట్టగలుగుతున్నారు. అవగాహనా శక్తి సహజంగానే పెరిగి వారు "తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకుంటూ" చదువులో మునుపటికంటే ఎక్కువ ప్రతిభను కనుబరుస్తున్నారు.

 

హైస్కూల్ విద్యార్థులు మా పాఠశాల లైబ్రెరీలలో ఉంచబడిన ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి .. జీవించే కళను నేర్చుకుని .. తమను తాము తెలుసుకునే జ్ఞానాన్ని పొందారు. "చదువు అంటే కేవలం డబ్బు సంపాందించి పెట్టే డిగ్రీ కాగితం" అని కాకుండా .. "చదువు అంటే తమను తాము తెలుసుకోవడం; ఈ లోకాన్ని తెలుసుకోవడం; తమ ఆలోచనలను తాము చదువుకోవడం; తమ ఊహలనూ, భావాలనూ నిజం చేసుకోవడం .. మరి తమ తమ విశిష్ట అభిరుచులను మెరుగుపెట్టుకోవడం" అని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడూ, ప్రతి ఒక్క తల్లీ, తండ్రీ తెలుసుకోవాలి.

 

ఇంత గొప్ప ఆత్మ విద్యాప్రచారంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఎంతో గర్విస్తున్నాను!

 

పద్మజ

కడప
94400 13759

Go to top