" నా సంకల్పం నెరవేరింది "

 

 

నా పేరు "రవీంద్ర"


ప్రకాశం జిల్లాలోని ఒకానొక మారుమూల గ్రామంలో జన్మించిన నేను 2009 లో "B.Tech " పూర్తి చేశాను.

 

ఉద్యోగప్రయత్నాలు ఫలించక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అశాంతికి గురి అయి .. స్నేహితుల సలహా మేరకు యోగా, జిమ్ ప్రయత్నం చేశాను. కానీ ఎంత మాత్రం లాభం లేకపోయింది. 2009 మే నెలలో "కందుకూరు" లో నిర్వహించబడిన "ఏడురోజుల పిరమిడ్ ధ్యానశిక్షణ" లో పాల్గొని ఎంతో ఆనందించాను.

 

ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్ చేరుకుని S.R. నగర్ కేర్ సెంటర్ నిర్వాహకులు "శ్రీ సుబ్బారావు" గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను! 2010 లో బెంగుళూరుకు వెళ్ళి ఉద్యోగం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాను. ఈ క్రమంలోనే "పిరమిడ్ వ్యాలీ" కి వెళ్ళి అక్కడ మెగా పిరమిడ్ కింగ్స్ ఛేంబర్‌లో కూర్చుని "నాకు 30 రోజులలో మంచి ఉద్యోగం రావాలి" అని సంకల్పం చేసుకున్నాను.

 

నెల రోజుల పాటు ఉద్యోగ ప్రయత్నాలు, ధ్యానం, ధ్యానప్రచారం, "ది సీక్రెట్" పుస్తకం లో చెప్పినట్లు నాకు కావలసిన దానిని దృశ్య చిత్రీకరణ చేసుకోవడం చేశాను! "Meditation + Visulization + Thought Power = Everything is Possible" అన్న విశ్వసూత్రం ప్రకారం ముప్ఫై రోజులు గడిచేసరికి రెండు కంపెనీలలో మంచి జీతంతో నేను సెలెక్ట్ అయ్యాను!

 

వాటిలో " IBM బెంగళూరు" లో చేరి ఉద్యోగం చేస్తూనే నా స్నేహితుల సహకారంతో "I One Solutions " అన్న జాబ్ కన్సల్టెన్సీని ప్రారంభించాను. నేను పాటించి విజయం సాధించిన ఆధ్యాత్మిక సూత్రాన్నే నా కన్సెల్టెన్సీకి వచ్చేవారితో సాధన చేయించగా .. ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన 150 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలను సంపాదించుకున్నారు!

 

PSSM లో నిర్వహించబడే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ .. చక్కటి ఆధ్యాత్మిక సమాచారాన్ని అందిస్తోన్న మేటి పత్రిక "ధ్యాన జగత్" కు చందాదారులను చేర్పిస్తున్నాను. అన్నదాన కార్యక్రమాలకు నా వంతు సహకారాన్ని అందిస్తూ .. మా స్వగ్రామంలో పిరమిడ్‌ను కూడా కట్టించాను! ప్రకాశం జిల్లా PSSM అధ్యక్షులు "శిద్ధా సూర్యప్రకాశరావు" గారు ఇటీవలే దానికి ప్రారంభోత్సవం చేశారు.

 

ఈ క్రమంలో ఎప్పటినుంచో "ఈజిప్ట్ వెళ్ళి గిజా పిరమిడ్ ను చూడాలి" అన్న నా కోరిక కూడా 2016 ఏప్రిల్ నెలలో తీరింది! పిరమిడ్ టూర్స్ ఽట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ యాత్రలో పత్రీజీతో కలిసి గీజా గ్రేట్ పిరమిడ్ కింగ్స్ ఛేంబర్‌లో పౌర్ణమి ధ్యానం, దహాబ్‌లో "స్పిరిచ్యువల్ రిట్రీట్" కార్యక్రమాలలో పాల్గొనడంతో నా జన్మ ధన్యం అయినట్లు భావించాను!

 

ఊహ తెలిసినప్పటి నుంచీ నాలో ఉన్న ఆశలన్నింటినీ తీర్చుకునే ధ్యానశక్తిని నాకు అందించిన పత్రీజీ కి శతకోటి వందనాలు!

 

రవీంద్ర

కమ్మవారిపల్లి గ్రామం

ప్రకాశం జిల్లా
99028 56285

Go to top