" ఇద్దరం కలిసి లోక కల్యాణం చేస్తున్నాం "

 

 

నా పేరు "సతీష్ కుమార్". తల్లితండ్ర్రులు తిరుపతి పిరమిడ్ మాస్టర్ అయిన "సుమతి" మరి "రాజేంద్ర నాయుడు" గార్లు. నేను చిన్నప్పటినుంచీ చదువులలో, ఆటపాటలలో మరి అల్లరిలో కూడా మొదటివాడిగానే ఉండేవాడిని. భగవంతుడి పట్ల భక్తితో ప్రతి శనివారం తిరుమలకు కాలినడకన వెళ్ళి అంగప్రదక్షణలు చేసి వచ్చేవాడిని.

 

1996 సంవత్సరంలో మా మామయ్య "పట్టా రామకృష్ణ" ద్వారా బ్రహ్మర్షి పత్రీజీని భీమాస్ హోటల్‌లో కలుసుకుని మొట్టమొదటి సారి సమక్షంలో ధ్యానం చేశాను. అప్పుడు వారు మౌనదీక్షలో ఉన్నారు!

 

ఇక అప్పటి నుంచి రోజుకు రెండు మూడు గంటల పాటు ధ్యానం చేస్తూ .. పత్రీజీ తిరుపతికి వచ్చినప్పుడల్లా వెళ్ళి వారిని కలిసి వస్తూండేవాడిని. ఒక సంవత్సరం పాటు వారితో కలిసి చాలా ప్రదేశాలు తిరిగి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ తరువాత మా అమ్మ సుమతి గారిని కూడా పత్రీజీ ధ్యాన శిక్షణా తరగతికి తీసుకుని వెళ్ళాను.

 

ధ్యానప్రచారంలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించి పత్రీజీ స్ఫూర్తిగా అమ్మతో కలిసి ఖమ్మం, భద్రాచలం, కడప, మహబూబ్‌నగర్, నంద్యాల, రాజమండ్రి ఇలా అన్ని ప్రదేశాలు తిరిగి ఎంతో ఆనందాన్ని పొంది నా జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకున్నాను.

 

ఆ తరువాత 2002లో ఉద్యోగంలో చేరి ఉద్యోగ రీత్యా కూడా చాలా ప్రదేశాలు తిరిగి ప్రాపంచిక జ్ఞానాన్ని కూడా నేర్చుకున్నాను. 2013లో ఇక "నా తుది శ్వాస వరకు .. ప్రపంచంలో అందరికీ ఆత్మ సత్యాన్ని శాకాహారాన్ని, పిరమిడ్ శక్తినీ గురించి తెలియజేయాలి" అని నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాను.

 

ఆరు నెలల పాటు తిరుపతిలోనే ఉండి వంద పాఠశాలలు మరి కళాశాలలో విద్యార్థలకు ధ్యాన ప్రచారం చేశాను. 2013లో కడ్తాల్ జరిగిన ధ్యానమహాచక్రంలో నా స్నేహితురాలయిన "సుగుణ" ను పెళ్ళి చేసుకుని ఇద్దరం కలిసి ఇప్పుడు లోక కళ్యాణం చేస్తున్నాం. ఈ లోగా నాకు కూడా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి హైదరాబాద్‌కు చేరుకుని .. హైదరాబాద్‌లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూన్న నా భార్య సుగుణతో కలిసి ధ్యాన ప్రచారం నిర్వహిస్తూన్నాను.

 

ఇటీవల పత్రీజీని కలిసినప్పుడు హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న పిరమిడ్‌ల సమాచారాన్నంతా ఇంటర్నెట్‌లో నమోదు చెయ్యమని చెప్పారు. వారి ఆదేశాన్ని అమలు చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ హాయిగా ఆనందంగా జీవిస్తున్నాను.

 

ఒక లక్ష్యం మరి గమ్యం కూడిన ఇంత మంచి జీవితాన్ని నాకు అందించిన గురువుగారికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను!

 

సతీష్‌కుమార్తి

రుపతి
99664 56180

Go to top