" నా విజయం వెనుక ధ్యానం "

 

 

నా పేరు "బిందుప్రియ". నేను ప్రస్తుతం ఇంటర్ పూర్తిచేశాను. నేను మా నాన్న Y.వేణు గారి ద్వారా ఆనాపానసతి ధ్యానం నేర్చుకున్నాను. 2010 వ సంవత్సరంలో మా నాన్నగారితో పాటు నేను కూడా శాకాహారిగా మారి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. పదవ తరగతిలో 9.7 గ్రేడ్‌ తో పాస్ అయ్యాను. తరువాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 465/470 మార్కులు పొందాను. రెండవ సంవత్సరం మొత్తం కలిపి 988/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంక్ పొందాను!

 

శ్రీ రామచంద్ర మిషన్ వాళ్ళు పెట్టిన జాతీయస్థాయి వ్యాస రచన పోటీలో నెల్లూరు డివిజన్ స్థాయిలో మొదటి ర్యాంక్ పొంది మెడల్ కూడా పొందాను! ఈ విజయాల పరంపర వెనుక నాకు ఎప్పుడూ ధ్యానం మరి పాజిటివ్ థింకింగ్ సహకరించాయి. చదువుకున్నది బాగా గుర్తుంటుంది. అలాగే ప్రెజెంటేషన్ కూడా బాగా చేయగలం.

 

నేను అప్పుడప్పుడు ధ్యానం క్లాసులకు కూడా వెళతాను. నాయుడుపేట "రాఘవేంద్ర మాస్టర్" క్లాసులు, వారి సలహాలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి. ఆస్ట్రల్ మాస్టర్స్ నాకు ఎప్పుడూ సహకరిస్తారని నా నమ్మకం. మా నాన్నగారు, మా అమ్మగారు ధ్యానానికి ఎంతో సేవచేస్తూ ఉంటారు. వారి సేవా ఫలితం కూడా నాకు కలిసివచ్చింది. ప్రతి విద్యార్థీ ధ్యానం చేస్తూ, చక్కగా చదివినట్లయితే వారి లక్ష్యం సులభంగా చేరవచ్చు. ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రీజీ గారికి నా ధన్యవాదాలు.

 

బిందుప్రియ

నాయుడుపేట

నెల్లూరు జిల్లా

Go to top