పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ - కరీంనగర్


" శాంతి భద్రతల పరిరక్షకులకు ధ్యానంలో ప్రశాంతత "

 

 

పోలీసు సిబ్బంది ధ్యాన అనుభవాలు

 

"నేను SP ఆఫీసులో పనిచేస్తున్నాను. గత 15 రోజుల నుంచి చేస్తున్న ధ్యానం వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడమే కాకుండా నేను నా ఆస్ట్రల్ బాడీని చూసుకున్నాను. మా జీవితాల గురించి పట్టించుకుంటూన్న SP సార్‌కీ, ధ్యాన గురువులు పత్రీజీకీ మా ధన్యవాదాలు"

కృష్ణమ్మ

 

"నాకు ఈ ధ్యానం వలన నాలో ఉన్న అలజడి, అనారోగ్యం తొలగి సంతోషంగా ఉన్నాను. నేను వరుసగా మూడు బ్యాచ్‌లలో వస్తూ ఎంతో శక్తిని జ్ఞానాన్ని పొందుతున్నాను. నాలోనే అనంతమైన శక్తి ఉందని తెలుసుకున్నాను. ధ్యానం నేర్పించిన SP సార్ కి, గురువు పత్రీజీకి ధన్యవాదాలు."

Ch. సావిత్రి, టైపిస్ట్

 

"నేను ధ్యానం ఆరు రోజులు చేసాను. ఇన్ని రోజులు నేను దేహభ్రాంతితో ఉన్న నేను పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మను అన్న సత్యాన్ని తెలుసుకున్నాను. ధ్యానం చేయడం వలన నాకు ఎంతో ప్రశాంతత లభించింది. రోగాలు, కలహాలు, ఈర్ష్య, ద్వేషాలు లేని మానవాళిని తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న బ్రహ్మర్షి పత్రీజీకి కోటి కృతజ్ఞతలు".


గొల్లపల్లి శ్రీనివాస్, 9949090905

 

"శ్వాస మీద ధ్యాస ద్వారా శ్వాసే ‘గురువు’ అని దైవం మన లోపలే ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకున్నాను. ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని మాకు పరిచయం చేసిన మాస్టర్లందరికీ, బ్రహ్మర్షి పత్రీజీకి నా హృదయపూర్వక వందనాలు."


ఉమారాణి, 94925 56993

 

 

Go to top