" ధ్యానంలో .. ఆస్ట్రల్ సర్జరీ "

 

 

 

నా పేరు "ప్రభావతి". నేను చిత్తూరు పట్టణంలో 25 సం||లుగా "క్వీన్స్ బ్యూటీ పార్లర్"ను నిర్వహిస్తున్నాను. నేను ఇస్కాన్ భక్తురాలిని. గత పది సంవత్సరాలుగా డస్ట్ అలర్జీ, గొంతునొప్పి, చెస్ట్ పెయిన్, మోకాళ్ళ నొప్పులతో విపరీతంగా బాధపడేదాన్ని. ఎన్ని మందులు వాడినా శాశ్వతంగా ఆ జబ్బులు నయం కాలేదు.

 

ఒకానొక రోజు "స్వాతి" అనే అమ్మాయి మా పార్లర్‌కు వచ్చి నేను జబ్బులతో బాధపడటం చూసి .. "ఆంటీ! గాంధీ రోడ్డులో గౌతమ బుద్ధా హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. పిరమిడ్ క్రింద కూర్చుని ధ్యానం చేస్తే ఎటువంటి వ్యాధులైనా నయమవుతాయి" అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి సలహా మేరకు పిరమిడ్ ధ్యానమందిరానికి వెళ్ళి "రాధికా మేడమ్"ను కలిసాను.

 

మేడమ్ సూచనల మేరకు రోజుకు నాలుగు గంటల చొప్పున 48రోజులు ధ్యానం చేయడం ద్వారా అన్ని వ్యాధుల నుంచి పూర్తిగా ఉపశమనం లభించింది. ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను!

 

2016 మే నెల 18వ తేదీన నేను మా వారితో కలిసి చైనాకు తొమ్మిది రోజుల టూర్ వెళ్ళాల్సి వుంది. కానీ అనుకోకుండా 17 వ తారీఖున స్కూటర్‌లో బయలుదేరడానికి ప్రయత్నిస్తూండగా వెనుకవైపు నుంచి ఒక ఆవు నన్ను క్రిందకు తోసివేసింది. నా ఎడమ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. డాక్టర్ ఎక్స్‌రేను చూసి ఆపరేషన్ చేయాలన్నారు.

 

"నేను చైనా కు టూర్ వెళ్తున్నాను; వెళ్ళి వచ్చిన తరువాత ఆపరేషన్ చేయించుకుంటాను" అని చెప్పి తాత్కాలికంగా కట్టు కట్టుకుని చైనా టూర్‌కు బయలుదేరాను.

 

టూర్ ఆఖరి రోజున చైనాలో బుద్ధుని దేవాలయంలో అతని పాదాల వద్ద శిరస్సును వంచి ప్రార్థన చేసుకున్నాను. "నేను ధ్యానాన్ని పూర్తిగా నమ్మి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితిలో నేను ఆపరేషన్ చేయించుకుంటే నా మాటలను, ధ్యానాన్ని ఎవరూ విశ్వసించరుగదా, నాకు ధ్యానం ద్వారానే ఎటువంటి ఆపరేషన్లు లేకుండా నయం కావాలి" అని కోరుకున్నాను.

 

ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత బెడ్ రూమ్‌లో పిరమిడ్ క్రింద పడుకుని ధ్యానం చేస్తున్నప్పుడు "ఆస్ట్రల్ సర్జరీ" జరిగి ఉదయం లేచేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది! డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్‌రే తీయించగా చేయి మామూలుగా ఉన్నట్టు రిపోర్టులో తేలింది! ఎటువంటి ఆపరేషన్ లేకుండా చెయ్యి మామూలుగా ఎలా అయ్యిందని డాక్టర్లే ఆశ్చర్యపోయారు!

 

ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మన అందరికీ అందించిన బ్రహ్మర్షి పత్రీజీకి పాదాభివందనం. ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి అన్ని వసతులను సమకూర్చి మన అందరికీ ఉచిత సేవలందిస్తున్న గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ రాధిక, గోపాలక్రిష్ణమూర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ధ్యానం చేసి, ధ్యాన ప్రచారం చేస్తూ వారి వారి జీవితాలను ఆనందమయం చేసుకోగలరని కోరుకుంటున్నాను.

 

N.ప్రభావతి

చిత్తూరు పట్టణం

చిత్తూరు జిల్లా

Go to top