" మహాద్భుతమైన పిరమిడ్ శక్తి "

 

 

నా పేరు "శ్రీనివాసులు". నేను కిరాణా వ్యాపారం చేస్తూ ఉంటాను. అనారోగ్య కారణంగా పది సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చాను. నా భార్య "భవాని"కి అనారోగ్యంతో రెండు కళ్ళు కనిపించకుండా (ఒక కన్ను పూర్తిగా కనిపించకుండా పోయింది) ఉన్నప్పుడు పూర్తిగా పిరమిడ్ ధ్యానం చేయించాను. పదిహేను రోజులలో ఆరోగ్యం బాగుపడి రెండు కళ్ళు బాగుగా కనిపిస్తున్నాయి!

 

అప్పటి నుంచి ధ్యానం చేస్తూ మాంసాహారిని అయిన నేను పూర్తి శాకాహారిగా మారి మా కుటుంబంతో పాటు మా బంధువులు, స్నేహితులను ఎంతో మందికి ధ్యానం నేర్పి శాకాహారులుగా మార్చాను. ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ నేను ఎన్నో శాకాహార ర్యాలీలలో పాల్గొన్నాను. మా ఇంటిపైన "శ్రీ సదానందయోగి పిరమిడ్ ధ్యానమందిరం" నిర్మించాము. 22.2.2015న బ్రహ్మర్షి పత్రీజీ వచ్చి ప్రాణప్రతిష్ట చేసారు.

 

8.6.2016 తెల్లవారుఝామున మా పిరమిడ్ ప్రక్కన పిడుగు పడి చుట్టుప్రక్కల ఉన్న ఇళ్ళలోని కరెంటు మీటర్లు ఇన్వర్టర్లు కాలిపోయాయి. మరి ప్రక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కూడా చెడిపోయింది. చుట్టుప్రక్కల ఇంత జరిగినా పిరమిడ్ ఉన్న మా ఇంటిలో మాత్రం మిరాకిల్‌గా ఏ నష్టం జరగలేదు! అదే పిరమిడ్ యొక్క మహాద్భుత శక్తి!

 


మీసాల శ్రీనివాసులు

వీరవాసరం
ప||గో||జిల్లా- 98660 32926.

Go to top