డాక్టర్ అమిత్ గోస్వామి


"క్వాంటమ్ భౌతిక శాస్త్రం .. ఆధ్యాత్మికత .. జీవిత అనుభవం .. అన్నీ ఒక్కటే"

 

 

డాక్టర్ అమిత్ గోస్వామి .. ప్రపంచ ప్రఖ్యాత క్వాంటమ్ భౌతికశాస్త్రవేత్త. జీవితంలో ఆధ్యాత్మిక కోణాన్ని శాస్త్రీయంగా ఆవిష్కరించే ఆసక్తికర, ప్రయోజనకర ప్రయోగాలను చేపట్టి అద్భుత ఫలితాలను వెల్లడించే అధునాతన విప్లవాత్మక శాస్త్రవేత్త. రచయిత, అధ్యాపకుడు: క్వాంటమ్ భౌతికశాస్త్రం, ఆధ్యాత్మికత, జీవిత అనుభవం భిన్నమైనవి కావు అవన్నీ ఒక్కటే అని సాధికారంగా అవగాహన చేసుకోవచ్చు. "క్వాంటమ్ భౌతికత సృష్టిక్రమపు మర్మాన్ని బహిర్గతం చేసి సచేతన, సంకల్ప సహిత లక్ష్యయుత ప్రత్యక్షీకరణ యొక్క సాధారణత్వాన్ని వెల్లడి చేస్తుంది" - అని చెప్పే డాక్టర్ అమిత్ గోస్వామి గారి నుంచి మరి కొంత సమాచారం మన కోసం.


- స్వర్ణలత

స్వర్ణలత: "నమస్కారం సర్, క్వాంటమ్ భౌతికశాస్త్రవేత్త అయిన మీ నుంచి కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలి అనుకుంతున్నాం .. చెపుతారా?"
డా||అమిత్ గోస్వామి: నమస్కారం .. తప్పకుండా చెపుతాను.


స్వర్ణలత: "మిమ్మల్ని విభిన్నంగా ఆలోచింపచేసింది ఏమిటి?"


డా|| అమిత్ గోస్వామి: జీవితంలో నేను ఎదుర్కొన్న విచారకర సంఘటనలు నన్ను ఆనందం కోసం అన్వేషించేటట్లు చేశాయి.


స్వర్ణలత: "దానిని మీరు ఎలా సాధించారు?"

 

డా|| అమిత్ గోస్వామి: ఆలోచన నాకు ఇష్టం. ప్రత్యేక మార్గదర్శకత్వం ఏదీ లేదు కానీ అనేక సంభావ్యతలు, ఉపాధ్యాయులు, స్నేహితులు, పుస్తక పఠనం .. అన్నీ కలిపి ఇక్కడకు చేర్చాయి.

 

స్వర్ణలత: "క్వాంటమ్ భౌతికశాస్త్రంపై ఆసక్తి ఎలా ఏర్పడింది?"


డా|| అమిత్ గోస్వామి: భౌతికశాస్త్రం అధ్యయనం చేసే కళాశాల విద్యార్థులందరికీ క్వాంటమ్ భౌతికశాస్త్రం ఒక అంశంగా వుంటుంది. నాకు తెలియకుండానే నేను దానిని నేర్చుకున్నాను. క్రమక్రమంగా ఆనందానికి మూలం "క్వాంటమ్ భౌతికతయే" అని అంతరావబోధతో తెలిసింది.

 

"క్వాంటమ్ స్వస్థత" అన్న ఆలోచన దీపక్ చోప్రా గారి నుంచి వచ్చింది. పూజ్యశ్రీ దలైలామాతో జరిగిన సమావేశం క్వాంటమ్ జ్ఞానాన్ని సామాజిక విషయాలలో అన్వయించేటట్లు చేసింది. వైద్యంతో అనుసంధిస్తూ "క్వాంటమ్ వైద్యం" అన్నది 2004 సంవత్సరంలో ప్రాచుర్యం పొందింది.

 

స్వర్ణలత: "మీ నిరంతర కృషి ద్వారా ఇంత అభివృద్ధి ఎంతో ప్రశంసనీయం కదా!"


డా|| అమిత్ గోస్వామి: వ్యక్తి కేవలం వాహకం మాత్రమే, మనకు కావలసిందీ ముఖ్యమైనదీ సందేశమే. "నేను కేవలం ఒక వాహకాన్ని" అని నాకు తెలుసు.

 

స్వర్ణలత: "వ్యక్తులపై కాంటమ్ భౌతికశాస్త్ర ప్రభావం ఎలా ఉండబోతుంది?"


డా|| అమిత్ గోస్వామి: క్వాంటమ్ భౌతికత అర్థమైతే .. "నా జీవితం నా చేతులలో లేదు, నేనేమీ మార్చలేను, అంతా కర్మ" అనే నిరాసక్తత నుంచి .. మొత్తం సంప్రదాయం, సంస్కృతి బంధించబడి వున్న జడత్వపు కోరలనుంచి .. మనుష్యులు బయటకు వస్తారు. అంతేకాక వ్యక్తులు తమ కోసం, తమ ప్రపంచం కోసం ఏమైనా చేయగల ఆత్మవిశ్వాసం పొందుతారు.

 

స్వర్ణలత: "సాధారణ మానవునికి క్వాంటమ్ భౌతికశాస్త్రం ఎలా తోడ్పడుతుంది?" Body- Mind - soul - you


డా|| అమిత్ గోస్వామి: మనం క్షణక్షణానికీ సంభావ్యతలను ఎంపిక చేసుకుంటాం. ఉదా: ఆరోగ్యం-అనారోగ్యం; ఆనందం-దుఃఖం. వ్యక్తిగత అభివృద్ధి అన్నది "అనుకూల దృక్పథం" అన్నదానిపై ఆధారపడి వుంటుంది. "ప్రతికూల దృక్పథం" అన్నది అభివృద్ధిని నిరోధిస్తుంది. ఆనందంగా వుంటూ అభివృద్ధి చెందాలంటే క్వాంటమ్ ప్రపంచం గురించి అవగాహన చేసుకుని అనుసరించి, సృజనాత్మకంగా మారవచ్చు. "నిష్క్రియా పరత్వం" అన్నది అభివృద్ధిని నిరోధిస్తుంది. దానికి బదులు సృజనాత్మకతను ఎంచుకోవచ్చు.

 

స్వర్ణలత: "విద్యారంగంపై దాని ప్రభావం ఎలా వుంది?"


డా|| అమిత్ గోస్వామి: నేటి విద్యారంగం కొంత సందిగ్ధ స్థితిలో వుంది. ఈ మార్పు చెందే కాలంలో వారు మారటానికి సిద్ధంగా లేరు. మార్పును ఇష్టపడటం లేదు. క్వాంటమ్ భౌతికశాస్త్రం అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టం అని వారు భయపడుతున్నారు.

 

ఒక్కసారి దానిని అర్థం చేసుకుంటే అదెంతో తేలికగా అనిపిస్తుంది. విద్యార్థులలో క్రియాశీలత, చైతన్యం పెంపొందుతాయి. దీనిని అర్థం చేసుకుంటే ప్రతి రంగంలోనూ జ్ఞాన, అవగాహనలు పెంపొందుతాయి.

 

స్వర్ణలత: నేటి విద్యారంగపు మాధ్యమిక స్థాయిలలో దీనిని చేర్చే అవకాశం వుందా?"


డా||అమిత్ గోస్వామి: మన మాధ్యమిక, కళాశాల స్థాయి విద్యలో సృజనాత్మకతకు చోటేలేదు. దానినేమీ బోధించటం లేదు. చైతన్యం గురించి వారు బోధించరు! "మానవశరీరం కూడా ఒక యంత్రం, ప్రతీదీ పదార్థంతో చేయబడుతుంది" అన్న దుష్ట సమాచారం మాత్రమే బోధించబడుతోంది. దాని స్థానంలో ఈ చైతన్య సమాచారం బోధించటానికి కొంతకాలం తప్పకుండా పడుతుంది.

 

స్వర్ణలత: "మనం ఈ అభిప్రాయాన్ని ఎలా మార్చగలం?"


డా|| అమిత్ గోస్వామి: సత్యం అనేది చైతన్యపు ఉద్యమం .. వ్యక్తులది కాదు. చైతన్యం స్వయంగా మార్పు చెందుతుంది. వివేకవంతులు దానిని పెంపొందిస్తారు. ఇప్పుడు మన వద్ద "గాంధీజీ", "రవీంద్రనాధ్ టాగూర్" వంటివాళ్ళు లేకపోవడం వల్ల మార్పు కొంచెం నిదానంగా జరుగుతోంది .. అయితే అనతికాలంలో అది సంభవించే తీరుతుంది!

 

స్వర్ణలత: "మీ ఉద్దేశంలో మార్పుకు మార్గం ఏది?"


డా|| అమిత్ గోస్వామి: ఒకానొక గొప్ప మార్పు ఆర్థిక అంశం ద్వారా వస్తుంది. సూక్ష్మశక్తికి, ఆధ్యాత్మికతకు విలువ ఇచ్చే ధనస్వామ్యం వైపు మన ఆర్థికవ్యవస్థ మళ్ళుతుంది. అప్పుడు అది సమాజంలోని ఇతర కోణాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఆర్థికవ్యవస్థలో ఆరోగ్యం, స్వస్థతలకు ముఖ్యస్థానం వుంది. 15-20 శాతం ధనం వాటిపైనే ఖర్చుపెడతారు. అవి శక్తి పుంజుకుంటే ఆ ప్రభావం మిగతా వాటిపై వుంటుంది.

 

స్వర్ణలత: "మీ స్వప్నం..?"


డా|| అమిత్ గోస్వామి: ప్రశాంతమూ, సృజనాత్మకమూ, ప్రజలందరూ తమ వ్యక్తిగత స్వప్నాలను సాకారం చేసుకోగలిగి, ఆనందంగా జీవించగల ప్రపంచాన్ని చూడటం, దానిలో జీవించటం .. క్వాంటమ్ భౌతికత అంటే "మనం చైతన్యం" అని అందరూ తెలుసుకుని దానికి అనుగుణంగా జీవిస్తే అది సాధ్యమే.

 

స్వర్ణలత: "పత్రీజీ గురించి మీ అభిప్రాయం?"


డా|| అమిత్ గోస్వామి: ఆయన నాకు "పెద్ద అన్న" వంటివారు! నాకు మాత్రమే కాదు .. అందరితోనూ ఆయన అంతే ప్రేమతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. I like his presence! మానవాళి సంక్షేమం కోసం ఆయన చేసే కృషిని నేను గౌరవిస్తాను! నేను కూడా దానిలో భాగంగా వుంటాను!

 

స్వర్ణలత: "భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ విశ్వవిద్యాలయ స్థాపకులు ఆయన మీకు మా అందరి తరపున అభినందనలు!"
డా|| అమిత్ గోస్వామి: Thank You!

Go to top